Viral: నీకో దండం సామీ.. అసలుసిసలు జాతిరత్నం మనోడు.. ఈ ఆన్సర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే!

|

Sep 06, 2022 | 7:31 PM

బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చెప్పాలంటే.. మనలో చాలామంది బ్యాక్ బెంచ్ స్టూడెంట్సే.

Viral: నీకో దండం సామీ.. అసలుసిసలు జాతిరత్నం మనోడు.. ఈ ఆన్సర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే!
Funny Answer
Follow us on

బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చెప్పాలంటే.. మనలో చాలామంది బ్యాక్ బెంచ్ స్టూడెంట్సే. వీళ్లంతా ఏం చేస్తారు చెప్పండి.! ఏముంది.. సరిగ్గా పరీక్షల సమయంలోనే చదువుతారు. ఇంకా చెప్పాలంటే స్లిప్‌లతో కాపీయింగ్ లేదా రాని ప్రశ్నలకు తమకు తోచిన సమాధానాలు రాయడం లాంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే అదో కిక్కు అనుకోండి.! వీరంతా వీక్లీ టెస్టులు లేదా ఎగ్జామ్స్‌లో రాసే ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ తలుచుకుంటే.. ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఈ కోవలోనే తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రాసిన ఇస్మార్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం..

‘వన్ వర్డ్‌లో స్కూల్ అంటే ఏంటి.?’ అనేది క్వశ్చన్ అయితే.. సాధారణంగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్.. ‘స్కూల్ = దేవాలయం’ అనే ఆన్సర్ ఇస్తాడు. కానీ ఇక్కడ మనోడు అభినవ జాతిరత్నం.. కొంచెం భిన్నంగా.. తన క్రియేటివిటీకి పదునుపెట్టి ఆన్సర్ చేశాడు. ‘హెల్(Hell)’ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘కుర్రాడు తోపురా మామ’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..