
నేటి డిజిటల్ యుగంలో గూగుల్ అనేది కేవలం ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు.. అది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏదైనా తెలియని విషయం ఉంటే వెంటనే గూగుల్ తల్లిని అడగడం మనకు అలవాటు. అయితే వివాహిత మహిళలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..? వారు కేవలం వంట రెసిపీల కోసమే గూగుల్‌ను వాడతారని అనుకుంటే పొరపాటే.. వారి సెర్చింగ్ హిస్టరీలో కుటుంబం, భర్త, ఆరోగ్యం, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు తమ భర్త మనసు గెలుచుకోవడం పెద్ద టాస్క్. చాలామంది మహిళలు తమ భర్తకు ఏం ఇష్టం..? వారిని ఎలా సంతోషంగా ఉంచాలి..? అనే విషయాలను నేరుగా అడగలేక గూగుల్‌లో వెతుకుతుంటారట. తమ వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అవసరమైన చిట్కాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇది వారి కొత్త జీవితంపై వారికి ఉన్న బాధ్యతను సూచిస్తుంది.
కొన్నిసార్లు ఈ సెర్చ్‌లు చాలా సరదాగా మరికొన్నిసార్లు వింతగా ఉంటాయి. తమ భర్తలు తమ మాట వినడం లేదని లేదా ఎప్పుడూ ఫోన్‌తోనో, పనితోనో పరధ్యానంగా ఉంటున్నారని భావించే భార్యలు.. భర్తను అదుపులో ఉంచుకోవడం ఎలా? అని గూగుల్‌ను అడుగుతున్నారట. ఇది కేవలం ఆధిపత్యం కోసం కాదు, భర్త నుంచి తగినంత గుర్తింపు, ప్రేమ లభించడం లేదన్న చిన్నపాటి అసంతృప్తికి ఇది సంకేతం కావచ్చు.
భారతీయ కుటుంబ వ్యవస్థలో అత్తమామలతో కలిసిపోవడం అనేది ఒక పెద్ద ఘట్టం. అత్తగారి ఇంట్లో ఎలా ప్రవర్తించాలి? తక్కువ సమయంలోనే కొత్త కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలి? వంటి చిట్కాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని వెళ్లడం, పండుగలు-తాంబులాల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులపై కూడా మహిళలు సమాచారం సేకరిస్తున్నారు.
సంతానం విషయంలో మహిళలకు గూగుల్ ఒక మెంటార్‌గా పనిచేస్తోంది. బిడ్డను కనడానికి ఏ నెల లేదా ఏ సీజన్ ఉత్తమమైనది? గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి ప్రశ్నలు సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటున్నాయి. కెరీర్ లేదా ఆర్థిక కారణాల వల్ల భర్త సంతానం వద్దనుకుంటే, ఆయనను ఎలా ఒప్పించాలి? అన్న క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాల కోసం వెతుకుతున్నారు.
ఎన్ని బాధ్యతలు ఉన్నా, తనను తాను అందంగా తీర్చిదిద్దుకోవాలనే కోరిక ప్రతి మహిళలోనూ ఉంటుంది. పెళ్లి తర్వాత వచ్చే శారీరక మార్పులను ఎలా నియంత్రించాలి? ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వంటి సౌందర్య చిట్కాల కోసం గూగుల్‌ను అడుగుతున్నారు. ఇంటి పని, ఆఫీస్ పని మధ్యలో తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే హెల్త్ టిప్స్ కూడా సెర్చ్ లిస్ట్‌లో ప్రముఖంగా కనిపిస్తాయి.
నిపించడానికి అవసరమైన సౌందర్య చిట్కాల కోసం కూడా వారు శోధిస్తున్నారు.
ఇంటి బాధ్యతలు పెరిగినప్పటికీ, తమ వ్యక్తిత్వాన్ని, కెరీర్‌ను వదులుకోవడానికి నేటి మహిళలు సిద్ధంగా లేరు. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే, ఆన్లైన్లో డబ్బు సంపాదించే మార్గాలు ఏమున్నాయి? వివాహం తర్వాత కెరీర్‌ను ఎలా కొనసాగించాలి? అనే అంశాలపై గూగుల్ ద్వారా అవగాహన పెంచుకుంటున్నారు. స్పెషల్ డేస్ రోజున భర్తకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి? సరికొత్త వంటకాలతో ఆయనను ఎలా ఆశ్చర్యపరచాలి? వంటి చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా సెర్చ్ చేస్తున్నారు.
మొత్తమ్మీద గూగుల్ సెర్చ్ డేటాను గమనిస్తే.. వివాహిత మహిళలు తమ కుటుంబం సంతోషం కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గూగుల్ వారికి ఒక సీక్రెట్ ఫ్రెండ్‌లా మారి, వారు ఎవరితోనూ పంచుకోలేని సందేహాలకు పరిష్కారాలను చూపుతోంది.