Viral Video: ‘లవర్సందు ఈ లవర్ వేరయా’.. ఈ వ్యక్తి చేసిన పని చూస్తే పడిపడి నవ్వాల్సిందే.!

'లవర్సందు ఈ లవర్ వేరయా'.. ఈ వ్యక్తి చేసిన పని చూస్తే పడిపడి నవ్వాల్సిందే.! అసలు ఆ వీడియో ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే..

Viral Video: లవర్సందు ఈ లవర్ వేరయా.. ఈ వ్యక్తి చేసిన పని చూస్తే పడిపడి నవ్వాల్సిందే.!
Viral Video

Updated on: Jul 27, 2022 | 12:06 PM

ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అవి ఫోటోలు కావొచ్చు, వీడియోలు అయిండొచ్చు. తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో బాయ్ ఫ్రెండ్ చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారంతే.!

వైరల్ వీడియో ప్రకారం.. ఇద్దరు లవర్స్ నది ఒడ్డున ఉన్న మెట్లపై కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఆ ఇద్దరూ.. కాసేపటి తర్వాత ఏం చేశారో తెలుసా.? బాయ్‌ఫ్రెండ్ ఏమో తన గర్ల్‌ఫ్రెండ్ తలలో పేను చూడటం మొదలుపెట్టాడు. బహుశా రెండు లేదా మూడు పేలను కూడా చంపి ఉండొచ్చు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ghantaa’ అనే పేజి నాలుగు రోజుల కిందట అప్‌లోడ్ చేయగా.. లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోకు 1.69 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ట్రూ లవ్ అంటే ఇదే మరి’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ప్రేమ అనేక రూపాల్లో ఉంటదని అంటారు. బహుశా అందులో ఒకటి ఇది’ అని మరొకరు రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us