
కారు రన్నింగ్‌లో ఉండగా ఇంజన్లో నుంచి పాము బయటకి వచ్చిన సంఘటన ఘాజియాబాద్‌లో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతి తన కారులో
నోయిడా వైపు వెళ్తుండగా కారు క్యాబిన్లో నుంచి సడెన్‌గా ఓ నాగుపాము బయటకు వచ్చింది. అది గమనించిన మహిళ ఒక్కాసారిగా షాక్ అయింది. కానీ ఆమె అస్సలు పానిక్ అవ్వకుండా, కారును జాగ్రత్తగా రోడ్డు పక్కన ఆపి, కిందకు దిగి వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఆమె ఏమాత్రం కంగారు పడి చిన్న పొరపాటు చేసినా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆమె భయపడకుండా ప్రశాంతంగా ఉండటమే వల్లే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థాలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రోడ్డుపై ఉన్న కారును సురక్షిత ప్రాంతానికి తరలించి స్నేక్ క్యాచర్ సహాయంతో జాగ్రత్తగా పాముకు ఎలాంటి హాని కాకుండా బయటకు తీశారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కారులో పాము దూరిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమైన రీతిలో కామెంట్స్ చేశారు. పామును చూసి కంగారు పడకుండా ఆ మహిళ వ్యవహించిన తీరును నెటిజన్లు ప్రశంసించారు. అలాగే సమాచారం అందిన వెంటనే సకాలంలో వచ్చిన ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తిని సైతం అభినందించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.