Viral Photo: ఎదురీత ముందు విధిరాత ఎంత.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇన్‌స్పైర్ అవుతారు

| Edited By: Ram Naramaneni

May 27, 2022 | 10:14 PM

మే 23, 2022న పోస్ట్ చేసిన ఈ వీడియోకి ట్విట్టర్‌లో లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో తమ మనసును హత్తుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Photo: ఎదురీత ముందు విధిరాత ఎంత.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇన్‌స్పైర్ అవుతారు
Inspiration
Follow us on

Trensing Video: తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతిదానిలో ఉత్తమమైన వాటిని అందించడానికి గొప్ప త్యాగాలు చేస్తారు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఇక్కడ ఓ వీడియో..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి ఇటీవల షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పిల్లల్ని బడికి పంపేందుకు అంగవైకల్యం కలిగిన ఓ తండ్రి పడుతున్న కష్టం ఈ వీడియోలో కనిపిస్తుంది.

వీడియోలో అంగవైకల్యంతో ఉన్న ఓ వ్యక్తి ట్రైసైకిల్‌పై స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు పిల్లలు కూర్చుబెట్టుకుని వెళ్తున్నాడు. పిల్లలిద్దరూ వెనకాల కూర్చుని ఉండగా, అతడు ట్రైసైకిల్‌ను చేతితో తొక్కుతున్నాడు. ఒక చిన్నారి వెనుక సీటులో కూర్చుంటే, మరోబాలుడు ముందు సీటులో ఉన్నాడు. ఎక్కడ రోడ్డుపై కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులేవరో వీడియోతీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియని ఈ తేదీ లేని వీడియోను సోనాల్ గోయెల్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను ట్వీట్ చేస్తున్నప్పుడు, అంగవైకల్యం కలిగిన ఆ వ్యక్తి ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా చెప్పుకొచ్చారు..ఎందుకంటే, తల్లిదండ్రులు మాత్రమే..తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారన్నది వాస్తవం..

మే 23, 2022న పోస్ట్ చేసిన ఈ వీడియోకి ట్విట్టర్‌లో లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఘటన మనసుకు హత్తుకునేదిగా ఉందంటూ కొందరు ట్విట్‌ చేశారు.