Viral Video: ఇది లక్ కాదు.. జాక్ పాట్.. స్క్రాప్‌లో ఏటీఎం కొనుగోలు.. ఓపెన్ చేస్తే డబ్బుల కుప్పలు..

|

Oct 06, 2021 | 6:50 PM

Viral Video: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు.. అదే దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతుందంటారు..

Viral Video: ఇది లక్ కాదు.. జాక్ పాట్.. స్క్రాప్‌లో ఏటీఎం కొనుగోలు.. ఓపెన్ చేస్తే డబ్బుల కుప్పలు..
Atm
Follow us on

Viral Video: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు.. అదే దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతుందంటారు.. ఇద్దరు యువకులకు ఈ నానుడి సరిగ్గా సరిపోలుతుంది. ఎందుకంటే.. వీరు ఆ తలుపు తీయడంతో వారి పంట పండింది. లక్ష్మీదేవి గలగలా చేతిలో వాలిపోయింది. స్ర్కాప్‌లో కొనుగోలు చేసిన ఏటీఎం నుంచి లక్షల రూపాయలు బయటకు వచ్చాయి. అది చూసి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. కొందరు యువకుడు జంక్ యార్డ్ నిర్వహిస్తున్నారు. పాత, కరాబ్ అయిన ఏటీఎం మెషీన్‌ను వారు స్క్రాప్‌గా కొనుగోలు చేశారు. అయితే, వారి దానిని డిస్ట్రాయ్(ధ్వంసం) చేసే క్రమంలో ఏటీఎం మెషీన్ ఒక్కొక్క పార్ట్‌ను విడదీస్తున్నారు. ఈ క్రమంలో ఊహించని విధంగా ఒక కరెన్సీ నోటు బయటకు వచ్చింది. మొత్తం ఓపెన్ చేసి చూడగా వేలాది డాలర్ల సొమ్ము ఏటీఎం మెషీన్‌లో ఉంది. అది చూసి ఆ యువకుల మైండ్ బ్లాంక్ అయ్యింది. తొలుత ఆశ్చర్యానికి గురైనా.. ఆ తరువాత తమ పంట పండిందనుకుని గంతులేశారు. మొత్తం రెండు వేల అమెరికన్ డాలర్లు ఆ మెషీన్‌లో బయటపడ్డాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయలకు సమానం.

అయితే, ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు రావడంపై స్పందించిన యువకులు.. ‘‘ఈ యంత్రాన్ని తమకు స్ర్కాప్‌గా అమ్మిన వ్యక్తికి తెలియకపోవచ్చు.. అందులో డబ్బులు ఉంటాయని. ఏటీఎం కీ అతని వద్ద లేదు. ఆ కారణంగానే అతను తెరలేకపోయాడేమో. మొత్తానికి అతను ఈ డబ్బును కోల్పోయాడు. మాకు అమ్మినప్పుడు కూడా కీ ఇవ్వలేదు. దాంతో మేం దానిని పగులగొట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలోనే ఏటీఎం మెషీన్‌ను పగులగొట్టి ఓపెన్ చేశాం. ఈ యంత్రాన్ని స్క్రాప్‌లో 300 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాం. కానీ, అందులో 2000 డాలర్లు బయటపడ్డాయి. ఇది అస్సలు ఊహించలేదు.’’ అని యువకులు చెప్పుకొచ్చారు.

కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ అంటే వీరిదే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పాతది, పనికిరానిది, తుప్పు అని దేనినీ విస్మరించకూడదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. మనం ఏదైతే పనికిరాదిని అని భావిస్తామో.. అదే అనుకోని విధంగా సహాయపడుతుంది అని మరికొందరు పేర్కొన్నారు. ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Also read:

Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

Apple Airpods: ఇక మీ ఎయిర్‌పాడ్ పోయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు.. అదెలాగంటే..

AP High Court on TTD: టీటీడీ బోర్డు కొత్త సభ్యులకు షాక్.. 18 మందికి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు