Viral Video: నోఫుడ్‌.. నోవాటర్‌.. ఓన్లీ ఆయిల్‌..సైంటిస్టులకే సవాల్‌!… నెట్టింట వైరల్‌గా మారిన ఆయిల్‌ కుమార్‌ లైఫ్‌స్టైల్‌

ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తింటున్నానని చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా...

Viral Video: నోఫుడ్‌.. నోవాటర్‌.. ఓన్లీ ఆయిల్‌..సైంటిస్టులకే సవాల్‌!... నెట్టింట వైరల్‌గా మారిన ఆయిల్‌ కుమార్‌ లైఫ్‌స్టైల్‌
Oil Kumar

Updated on: Sep 18, 2025 | 4:52 PM

ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తింటున్నానని చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారాడు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి షాక్ అయ్యారు. 33 ఏళ్ల ఆ వ్యక్తి ఇప్పటికీ ఫిట్‌గా ఉండటానికి గల కారణాన్ని స్పష్టం చేయలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఈ వ్యకత్ఇ ఆయిల్ కుమార్‌గా స్థానికంగా ఫేమస్‌ అయిపోయారు. అయ్యప్ప భగవంతుని ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమవుతుందని అన్నారు.

ఆయిల్ కుమార్ ఆహారం లేకుండా జీవిస్తాడు. అన్నం, చపాతీకి బదులుగా, అతను రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. అతను ఇప్పటివరకు ఆసుపత్రికి వెళ్లలేదు. ఎటువంటి వైద్య సహాయం అవసరం పడలేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నాడని కూడా నివేదికలు చెబుతున్నాయి.

అతని ప్రమాదకరమైన రోజువారీ ఆహారం చూసి ఆశ్చర్యపోయిన సోషల్‌ మీడియా వినియోగదారుడు ఈ వీడియోను పోస్టు చేశాడు. మానవులు నిజంగా ఇంజిన్ ఆయిల్ తాగగలరా లేదా అని నిర్ధారించడానికి AIని సంప్రదించారు, దీనికి AI దిగ్భ్రాంతికరమైన ఫలితాలతో స్పందించింది.

ఇంజిన్ ఆయిల్ తాగడం మానవ శరీరానికి నిజంగా హానికరం, ఇది తీవ్రమైన విషాదానికి దారితీస్తుందని AI తెలిపింది. ఇది విషపూరితమైనది. కోమాలోకి వెళతారు. మరణిస్తారు కూడా అని AI స్పందించింది.

అయిల్‌ కుమార్‌ కథ కర్ణాటకలోనే కాకుండా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది, ఇది నిజమైన విశ్వాసం యొక్క అద్భుతం అని దృష్టిని ఆకర్షిస్తుంది అని వినియోగదారు క్యాప్షన్‌లో రాశారు.

వీడియో చూడండి:

వైరల్ క్లిప్‌లో ప్రజలు అతనికి ఆహారం అందిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ అతను నిరాకరించి బదులుగా నేరుగా బాటిల్ నుండి ఆయిల్‌ తాగుతాడు. ఇంజిన్ ఆయిల్ చాలా విషపూరితమైనది. కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడును దెబ్బతీసే హైడ్రోకార్బన్లు, భారీ లోహాలను కలిగి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.