అరె..! వాహనాలన్నీ ఎక్కడ మాయమవుతున్నాయి…?

| Edited By:

Jul 02, 2019 | 8:17 PM

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో ఇట్టే తెలిసిపోయేలా చేసింది. అంతేకాదు.. దీంతో పాటే చిత్ర విచిత్రమైన చిత్రాలు, వీడియోలు కూడా దీని ద్వారా బయటపడుతున్నాయి. దీంట్లో వచ్చే కొన్ని ఫోటోలు, వీడియోలు చూస్తే.. బుర్రకు ఎంత పదును పెట్టినా.. నిజమేంటో తెల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతో తెలుసుకునే తీరిక నెటిజన్లకు లేక.. వాటిని షేర్ చేస్తూ.. […]

అరె..! వాహనాలన్నీ ఎక్కడ మాయమవుతున్నాయి...?
Follow us on

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో ఇట్టే తెలిసిపోయేలా చేసింది. అంతేకాదు.. దీంతో పాటే చిత్ర విచిత్రమైన చిత్రాలు, వీడియోలు కూడా దీని ద్వారా బయటపడుతున్నాయి. దీంట్లో వచ్చే కొన్ని ఫోటోలు, వీడియోలు చూస్తే.. బుర్రకు ఎంత పదును పెట్టినా.. నిజమేంటో తెల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతో తెలుసుకునే తీరిక నెటిజన్లకు లేక.. వాటిని షేర్ చేస్తూ.. వస్తున్న లైక్లు, కామెంట్లకు పొంగిపోతుంటారు. అయితే ఓ నెటిజన్.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోలో.. ఓ బ్రిడ్జ్ కిందకు వెళ్తున్న వాహనాలన్నీ మాయమవుతున్నాయి. ఓ కూడలిలో ఉన్న వాహనాలు వంతెనను దాడుతూ అదృశ్యమవుతున్నట్లు.. ఓ వీడియో తీశారు. ఒక నదిపై కట్టిన వంతెనను గోడల వైపు ప్రయాణిస్తున్న వాహనాలు అదృష్యమవుతుండడం నెటిజెన్లందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆ వీడియో.

డానియేల్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘అవును, ట్రాఫిక్ ఇలా అదృశ్యమవుతోంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా దీనిపై నెటిజెన్లు ఒక్కక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.