Viral Video: నమ్మలేని నిజం… రమేశ్ రెండవ వీడియో చూశారా?… కూలిన విమాన మంటల నుంచి నడిచొస్తున్న విశ్వాస్ కొత్త వీడియో..!

ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనలో మరో కొత్త వీడియో బయటకొచ్చింది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ క్రాష్ సైట్ నుంచి బయటకు నడిచొస్తున్న మరో కొత్త వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. అతడు మెడికల్...

Viral Video: నమ్మలేని నిజం... రమేశ్ రెండవ వీడియో చూశారా?...  కూలిన విమాన మంటల నుంచి నడిచొస్తున్న విశ్వాస్ కొత్త వీడియో..!
Ramesh Viswas

Updated on: Jun 17, 2025 | 4:53 PM

ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనలో మరో కొత్త వీడియో బయటకొచ్చింది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ క్రాష్ సైట్ నుంచి బయటకు నడిచొస్తున్న మరో కొత్త వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. అతడు మెడికల్ కాలేజీ హాస్టల్ ఆవరణ నుంచి వస్తుండగా, వెనక వైపు భీకరమైన అగ్ని కీలలు ఎగసి పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ గందరగోళ వాతావరణంలో రమేష్ వైట్ టీ షర్టులో నెమ్మదిగా.. కుంటుకుంటూ రావటం, ఆ సమయంలోనూ ఎడమ చేతితో ఫోన్ పట్టుకుని ఉండట ఈ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఒకవైపు కూలిన విమానం భయంకరంగా తగలబడి పోతుండగా, ఈ కంగారులో అక్కడి జనం అటూ ఇటూ కంగారుగా పరిగెత్తటం కూడా అతడు వస్తున్న ఈ వీడియోలో రికార్డ్ అయింది. ఇంతకు ముందు విమాన ప్రమాదం జరిగిన 33 సెకన్లకే ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రమేష్ గాయాలతో రక్తం కారుతూ నడుస్తూ కనిపించాడు.

జూన్ 12 వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్‌ బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, విమాన సిబ్బందితో సహా విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. క్రాష్ అయ్యే క్రమంలో విమానం అక్కడి మెడికల్ కాలేజి హాస్టల్ పై పడటంతో పలువురు మెడికోలు కూడా మృతి చెందారు.

అయితే, నమ్మశక్యం కాని రీతిలో ఈ విమానంలోని 11A సీటులో కూర్చున్న రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.ఇంగ్లండ్‌లో పనిచేస్తూ.. భారత్ వచ్చిన రమేష్ విశ్వస్ కుమార్‌ తిరిగి లండన్ వెళ్లే క్రమంలో విమానంలోని డోర్ కు కుడివైపు ఉండే సీట్ 11A సీటులో కూర్చోవటం, ప్రమాద సమయంలో వెంటనే ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకటంతో అతడు బతికి బట్టకలిగాడని అధికారులు అంటున్నారు.

 

వీడియో చూడండి: