Viral Video: ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా మ‌హిళ‌.. అంత‌లోనే త‌లుపుకొట్టిన భ‌ర్త.. కట్‌చేస్తే..

సమాజంలో రోజురోజుకూ మానసంబంధాలు మరుగునపడుతున్నాయి. కలకాలం కలిసుందామని ఏడడుగులు వేసి వెంటనే వచ్చిన వారు.. భాగస్వాములను మధ్యలోనే వదిలేసి వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది ఒక వివాహితన తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ తన భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయింది.

Viral Video: ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా మ‌హిళ‌.. అంత‌లోనే త‌లుపుకొట్టిన భ‌ర్త.. కట్‌చేస్తే..
Extramarital Affair Video

Updated on: Aug 27, 2025 | 2:32 PM

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వారు ఉండగానే కొందరు ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకరాం.. ఓ వివాహితన తన భర్త లేని సమయంలో ఇంట్లో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతోంది. ఇద్దరూ హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా ఉన్నారు. అయితే ఇంతలోనే అక్కడికి చేరకున్న ఆమె భర్త ఇంటి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు.

అయితే కాలింగ్‌ బెల్‌ మోగగానే ఇంట్లో ఏకాంతగా ఉన్న జంట ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. వచ్చింది తన భర్తే అనుకున్న భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా తన ప్రియుడికి ఒంటిపై బట్టలు కూడా లేకపోవడంతో ఆమెకు టెన్షన్ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో డోర్ తీయడానికి ఆలోచించింది. ఎన్ని సార్లు బెల్‌ కొట్టిన భార్య తలుపు తీయకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. చివరికి ఇంట్లో తన భార్య ప్రియుడుతో ఉన్నట్టు తెలుసుకున్నాడు.

అయితే ప్రియురాలి భర్త వ‌చ్చాడ‌న్న విషయం తెలుసుకున్న ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి పారిపోదాం అనుకున్నాడు. కానీ అది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు.. అతన్ను దొంగగా భావించి పట్టుకోవడానికి వెంబడించారు. చివరకు అతన్ని పట్టుకున్నారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతన్న వీడియో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.