
Viral Video: జింకలు కేవలం గడ్డిని మాత్రమే తిని బ్రతికే శాంతియుతమైన శాకాహార జీవులని మనం తరచుగా వింటుంటాము. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో ఒక జింక సుమారు 5 అడుగుల పొడవున్న పామును చాలా సులభంగా నమిలి మింగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాకవుతున్నారు.
ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. శాకాహారి అయిన జింక ఇలా ఎందుకు చేసింది? ప్రకృతి శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తల ప్రకారం, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. జింకల శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్ లేదా ఇతర అవసరమైన ఖనిజాల లోపం ఉన్నప్పుడు అవి తరచుగా ఇలాంటి అసాధారణ ప్రవర్తనను ప్రదర్శిస్తాయట. ముఖ్యంగా వాటి కొమ్ములు పెరుగుతున్నప్పుడు లేదా ఆడ జింక గర్భవతిగా ఉన్నప్పుడు వాటికి ఎక్కువ పోషణ అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితులలో అవి తమ శారీరక అవసరాలను తీర్చుకోవడానికి ఎముకలను లేదా చనిపోయిన జంతువులను తినేందుకు వెనుకాడవని చెబుతున్నారు. ఈ వీడియో పాతది అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
जीवन विज्ञान के सारे अध्याय की धज्जियां बिगाड़ दी इसने जीव विज्ञान सदमे में है
अगर वीडियो रिकॉर्ड न किया गया होता तो मैं खुद कभी विश्वास नहीं करता
प्राकृतिक के नियम भी हैरान है – अगर हिरण सांप खाने लगे, तो अब जरूरत है कि जीव विज्ञान नया संस्करण छपे और रिसर्च करे pic.twitter.com/0HUv8Mhi8O
— Sandeep Kumar (@Sandeep52748637) July 6, 2026
ప్రకృతి మనల్ని ఈ విధంగా ఆశ్చర్యపరచడం ఇదే మొదటిసారి కాదు. వన్యప్రాణి నిపుణుల ప్రకారం, జింకలు కూడా అవకాశవాదులే. వాటికి ఒక చిన్న జీవి, గుడ్డు లేదా పక్షి సులభంగా దొరికితే, దాన్ని తినడానికి అవి ఏమాత్రం సంకోచించవు. మన పాఠ్యపుస్తకాల నిర్వచనాల కంటే అడవి నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని ఈ సంఘటన మనకు బోధిస్తుంది. ప్రకృతి రహస్యాలకు అంతులేదని చెప్పవచ్చు. అలాగే ఈ వీడియో దానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ దృశ్యం అరుదైనప్పటికీ, ఆహారం అవసరమైనప్పుడు జీవులు తమ ప్రాథమిక అలవాట్లను అధిగమించగలవని స్పష్టమవుతోంది.
మరిన్ని ట్రెడింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి