Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఫ్రిజ్‌ డోర్ ఓపెన్ చేయగానే అదులో ఓ భారీ త్రాచుపాము కనిపించింది. అది చూసిన మహిళా ఒక్కసారి భయంతో కేకలు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు
Snake Found In The Fridge

Updated on: Aug 05, 2026 | 10:38 AM

ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ను క్లీన్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు అందులో పాము కనిపించిన ఘటన జాజ్‌పూర్ జిల్లా పాణికోయిలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనాస్ పంచాయతీలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలి వైతరణి నది ఉప్పొంగడంతో పనాస్ పంచాయతీ పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. అయితే ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో ప్రజలు తిరిగి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.

అయితే స్థానికంగా నివాసం ఉంటున్న జహీర్ ఉద్దీన్ ఖాన్ అనే వ్యక్తి కూడా తన ఫ్యామిలీతో పాటు ఇంటిని శుభ్రం చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఇంట్లో అతని భార్య ఫ్రిజ్‌ను క్లిన్ చేసేందుకు వెళ్లింది. మూసి ఉన్న ఫ్రిజ్‌ను ఓపెన్ చేయగానే అందులో ఓ భారీ త్రాచు పాము కనిపించింది. పామును చూసి ఒక్కసారిగా షాక్‌కు అయిన ఆమె భయంతో కేకలు వేసింది. అది గమనించిన జహీర్ ఉద్దీన్ వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. చాకచక్యంగా వ్యవహరించి, ఫ్రిజ్ లోపల ఉన్న కోబ్రాను ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటకు తీసి, దట్టమైన అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి విడిచిపెట్టంది. దీంతో జహీర్ ఉద్దీన్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూండి..

వరద బాధితులకు హెచ్చరిక

వరదలు తగ్గిన తర్వాత ఇళ్లకు తిరిగొచ్చే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రెస్క్యూ టీమ్ ప్రజలకు సూచించారు. వరద నీటి ప్రవాహంలో పాములు, ఇతర విషకీటకాలు కొట్టుకొచ్చి ఇళ్లలోకి చేరుతుంటాయని.. నీరు తగ్గాక అవి ఫర్నిచర్, దుస్తులు, అలమారాలు, ఫ్రిజ్‌లు, చీకటి మూలల్లో దాక్కుంటాయని.. ఇళ్లను శుభ్రం చేసేటప్పుడు ప్రతి మూలను కర్రతో తట్టి, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే వస్తువులను తాకాలని తెలిపారు. ఇంట్లో పాము కనిపిస్తే దానిని సొంతంగా పట్టుకోవడానికి లేదా తారమడానికి ప్రయత్నించవద్దని.. వెంటనే నిపుణులైన రెస్క్యూ టీమ్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us