Viral Video: ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు చూపించిన నాగరాజు..

ఐటీ హబ్ బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అవ్వడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. కానీ బుధవారం సాయంత్రం ప్యాలెస్ రోడ్డులో జరిగిన ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్‌ను నిలిపేసింది ఏ విఐపి కాన్వాయ్ కాదు.. రోడ్డు మధ్యలో పడగ విప్పి కూర్చున్న నాగరాజు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు చూపించిన నాగరాజు..
Cobra Creates Traffic Jam On Bengaluru Palace Road

Updated on: Jul 09, 2026 | 10:31 AM

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ దూరమైన గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే.. కానీ బుధవారం సాయంత్రం ప్యాలెస్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఒక ఊహించని ఘటన ఎదురైంది. రోడ్డు మధ్యలోకి వచ్చిన నాగపాము పడగ విప్పి తిష్ఠ వేయడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాధారణంగా వాహనాల హారన్ల శబ్దానికి పాములు పారిపోతుంటాయి. కానీ ఈ పాము మాత్రం దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు రోడ్డు మధ్యలోనే పడగ విప్పి గంభీరంగా ఉండిపోయింది. ట్రాఫిక్ రూల్స్ నాకేం అవసరం ప్రశాంతంగా ఒకే చోట స్థిరంగా ఉండిపోయింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాముకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, అది ఎవరిపై దాడి చేస్తుందో అని భయంతో వాహనాలను నెమ్మదించారు.

బీఎండబ్ల్యూ లేకుండానే వీఐపీ రేంజ్ ట్రాఫిక్ జామ్..

ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. ‘‘బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త వీఐపీ వచ్చారు. ప్యాలెస్ రోడ్డులో నాగరాజు 30 నిమిషాల పాటు ఈవినింగ్ మెడిటేషన్ సెషన్ పెట్టుకున్నట్లున్నారు’’ అని ఒకరు క్యాప్షన్ పెట్టగా.. ‘‘బెంగళూరులోనే ఇలాంటి వింతలు సాధ్యం. ఒక బీఎండబ్ల్యూ కారు కూడా లేకుండానే కోబ్రా ట్రాఫిక్ జామ్ సృష్టించింది. నగరానికి కొత్త ట్రాఫిక్ కంట్రోలర్ దొరికారు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సురక్షితంగా రక్షించిన పోలీసులు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనదారులకు, అలాగే ఆ పాముకు ఎలాంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పామును పక్కకు తీసుకెళ్లిన తర్వాతే ప్యాలెస్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లీ యథావిధిగా సాగింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నగరాలు విస్తరిస్తూ ఉండటం వల్ల అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఇలా నగరాల బాట పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

Follow Us