Trending Video: నేటి యువత ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు పెళ్లిలో వధువులు సిగ్గుతో తలవంచుకుని పీటలపై కూర్చుని ఉండేవారు. కానీ ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటూనే పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, బరాత్‌లో డ్యాన్స్‌లు చేయడానికి అమ్మాయిలను లాక్కెళ్లే వారు. కానీ ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా అమ్మాయిలు ఒక రేంజ్‌లో మాస్ స్టెప్పులు వేస్తూ.. గెస్ట్‌ల దిమాక్ కరాబ్ చేస్తున్నారు. ఇదెంటి అంటే.. ఇప్పుడు ట్రెండ్ ఇదే గురూ అంటున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లిలో వధువుతో పాటు కొంత మంది అమ్మాయిలు జక్కన్న తెరకెక్కించిన RRR చిత్రంలోని ‘నాటు నాటు’ పాట(Naatu Naatu Song)కు ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. సాంగ్‌కు తగ్గట్టుగా వాళ్లు వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక గతంలో బరాత్ సందర్భంగా ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి ఓ నవ వధువు వేసిన డ్యాన్స్ ఏ రేంజ్‌లో అయితే వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్‌లో ఈ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.