Viral Video: కొండచిలువను కొరికి 2 ముక్కలు చేయాలనుకున్న మొసలి.. చివరకు

|

May 23, 2022 | 4:22 PM

తన మానాన తాను నీటిలో సేద తీరుతున్న మొసలి వద్దకు పెద్ద పోటుగత్తెలా వెళ్లింది కొండచిలువ. వార్‌ వన్ ‌ సైడ్ అన్నట్లు ఫోజ్ కొట్టింది.. చివరకు

Viral Video: కొండచిలువను కొరికి 2 ముక్కలు చేయాలనుకున్న మొసలి.. చివరకు
Crocodile Python Fighting
Follow us on

Trending Video: జంగిల్‌లో బ్రతకాలంటే ఏ జంతువైనా ఫైట్ చేయడం, డిఫెన్స్ చేయడం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక జీవికి ఆకలి వేసిందంటే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే. ఆకులు, పండ్లు మాత్రమే తినే జీవులు చాలా తక్కువ ఉంటాయి. అడవిలో మెజార్టీ జంతువులు మాంసాహారులే. ఇక మొసలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటిలో ఉంటే అది స్థానబలంపై చెలరేగిపోతుంది. ఎంత పెద్ద జంతువునైనా కరకర నమిలి మింగిస్తేంది. భారీ సైజ్ ఏనుగును(Elephant) సైతం అల్లాడిస్తుంది. ఇక పైథాన్(Python) అదే కొండచిలువ గురించి అందరికీ తెలిసిందే. భారీ సైజ్‌లో పైథాన్.. పెద్ద, పెద్ద జంతువులును సైతం అమాంతం మింగేస్తుంది. కాగా మొసలి, పైథాన్‌.. ఒకదానికొకటి ఎదరుపడితే.. ఎట్టా ఉంటుంది. ఆ ఫైట్ ఊహించడమే కష్టం. అయితే అలాంటి వార్ కెమెరా కంటికి చిక్కింది. తొలుత కొండచిలువ నీటి మడుగులో ఉన్న మొసలి వద్దకు వెళ్లి అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. ముసలి కూడా వార్‌కు రెడీ అయిపోయింది. రెండింటి మధ్య భీకర యుద్ధం జరిగింది. మొసలి రఫ్పాడించింది. దవడ పళ్లతో కొరికి కొండచిలువను 2 ముక్కలు చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అది విలవిల్లాడిపోయింది. కాళ్ల బేరానికి వచ్చినంత పని చేసింది. దీంతో మొసలి జాలిపడి వదిలేసింది. ఆపై రెండూ తమ మానాన తాము వెళ్లిపోయాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తూ.. విభిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.