
చాలా మంది పాముల చూస్తేనే ఆమడదూరం పరిగెడతారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి.. అవి కరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయితే ఈ పాములు ప్రచంలో ఉన్న అన్ని జీవుల కన్నా కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే పాములు అంటే భయం ఉన్నప్పటికీ చాలా మంది వాటి గురించి చెప్తే వినడానికి ఆసక్తి చూపుతారు. మీకూ ఆ ఇంట్రెస్ట్ ఉంచే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడో పాము చాలా వింతగా తనను తానే మింగేసేందుకు ప్రయత్నించింది.
అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే నిజమనే అనిపిస్తోంది. తాజాగా @TheeDarkCircle అనే ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రకారం.. ఒక పాము తన తోక భాగాన్ని తానే మింగేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలానే తోక నుంచి మొదలు కొద్ది కొదిగా ఆ పాము తన మొత్తం శరీరాన్ని మింగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కవైనప్పుడు, లేదా పాములు తీవ్రంగా ఒత్తిడి గురైనప్పుడు వాటి నాడి వ్యవస్థ లోపించి.. అవి ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
— Wildlife Uncensored (@TheeDarkCircle) February 13, 2026
అయితే ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేలల్లో లైక్స్, వీవ్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశాయి. పాములు ఆకలి వేసినప్పుడు తన పిల్లలనే తింటాయని విన్నాం, కానీ వాటిని అవే తినడం ఇప్పుడే చూస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.