ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!

హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్‌పంప్‌లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు వస్తుంది. కానీ, ఇక్కడ కనిపించిన హ్యాండ్‌పంప్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక భారతీయుడు రష్యా పర్యటనలో ఈ వింత పంప్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!
Russian Hand Pump Technolog

Updated on: Apr 21, 2026 | 4:27 PM

సాధారణంగా హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్‌పంప్‌లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు వస్తుంది. కానీ, ఇక్కడ కనిపించిన హ్యాండ్‌పంప్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక భారతీయుడు రష్యా పర్యటనలో ఈ వింత పంప్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

సాధారణంగా హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. మన దేశంలో చేతి పంపులను దాదాపుగా అందరూ చాలాసార్లు చూసి ఉంటారు. బహుశా మీరు వాటిని ఉపయోగించి కూడా ఉంటారు. కానీ, మన దేశానికి చెందిన ఒక యువకుడు రష్యాలో పర్యటించినప్పుడు అక్కడ ఒక చేతి పంపును చూశాడు.. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ రష్యన్ చేతి పంపు నుండి నీటిని తోడే విధానం చాలా విలక్షణంగా ఉంది. రష్యాలో భూగర్భ జలాలను వెలికితీసేందుకు ఉపయోగించే ఒక వినూత్నమైన హ్యాండ్‌పంప్ (Handpump) కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది భారతదేశంలోని సాధారణ హ్యాండ్‌పంప్‌ల కంటే చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇవి కూడా చదవండి

మెకానిజం ఎలా ఉంటుంది?:

భారతదేశ హ్యాండ్‌పంప్‌లలో పిస్టన్ ద్వారా నీటిని పైకి లాగడానికి హ్యాండిల్ అవసరం. కానీ రష్యన్ హ్యాండ్‌పంప్ ఒక పొడవైన పైపు లాగా ఉండి, దాని పైభాగంలో ఒక చిన్న నాబ్ లాంటిది ఉంటుంది. దీనిని కొద్దిగా కిందకు నొక్కగానే లోపల ఉన్న స్ప్రింగ్ ఒత్తిడి వల్ల నీరు ధారాళంగా వస్తుంది. దీనికోసం పెద్దగా కండరాల బలం వాడాల్సిన అవసరం లేదు. కేవలం వేలితో నొక్కినా నీరు వస్తుంది.

ఎందుకు ఈ తేడా?:

రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. అటువంటి వాతావరణంలో సాధారణ హ్యాండ్‌పంప్‌లు వాడితే లోపల నీరు గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ఈ రష్యన్ పంప్‌లను భూమి లోపల చాలా లోతు వరకు ప్రత్యేక ఇన్సులేషన్, స్ప్రింగ్ మెకానిజంతో నిర్మిస్తారు. దీనివల్ల గడ్డకట్టే చలిలో కూడా నీరు సులభంగా బయటకు వస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఒక భారతీయ పర్యాటకుడు ఆ పంప్‌ను ఆపరేట్ చేస్తూ.. మన దేశంలో హ్యాండ్‌పంప్ కొట్టాలంటే చాలా కష్టపడాలి, కానీ ఇక్కడ కేవలం నొక్కితే చాలు నీళ్లు వస్తున్నాయి అని వివరించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంజనీరింగ్ అద్భుతానికి, సరళతకు ఈ పంప్ ఒక నిదర్శనమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సాంకేతికత అనేది అవసరాన్ని బట్టి ఎలా మారుతుందో చెప్పడానికి ఈ రష్యన్ హ్యాండ్‌పంప్ ఒక మంచి ఉదాహరణ. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఈ ట్రిక్ నిజంగా అభినందనీయం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us