Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

సాధారణంగా పులి, లేదా సింహం కనిపిస్తే అడవిలో ఉంటే ఏ జంతువైన పరుగులు పెట్టాల్సిందే. ఇది ఎప్పుడూ జరిగే తంతే. కానీ ఇటీవల పీలీభీత్ టైగర్ రిజర్వ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అరుదైన సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఎలుగుబంటి చూసి ఓ పులి పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే
Sloth Bear Charges At Tigress In Rare Wildlife Moment (1)

Updated on: Mar 18, 2026 | 11:37 AM

ఎక్కడైనా పులిని చూసి అడవిలో ఉన్న ఇతర జంతువులు పరిగెత్తడం మీరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలుగుబంటిని చూసి ఓ పులి పరుగులు పెట్టింది. అవును ఈ ఘటన మార్చి 13న పీలీభీత్ టైగర్ రిజర్వ్‌ సెంటర్‌ లో వెలుగు చూసింది. ఇక్కడ నివసిస్తున్న నైనా అనే ఓ ఆడపులి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్‌గా ఒక ఎలుగుబంటి దానికి ఎదురవుతుంది. అయినా దాన్ని జోలికి వెళ్లకుండా పులి ముందుకు వెళ్తోంది. ఇంతలో ఆ ఎలుగుబంటి పులిపైకి దూసుకొచ్చింది. అది చూసిన పులి దాని నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది చూసిన సఫారీకి వచ్చిన పర్యాటకులు ఎలుగుబంటికి పులి భయపడడం ఏంటని ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే మణిందర్ సింగ్ ధలివాల్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది విపరీతంగా వైరల్ అయ్యింది. దీని చూసిన నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పులులు చాలా తెలివైనవని.. వాటికి అనవసరంగా గాయపడటం ఇష్టం లేకే అది ఎలుగుబంటి నంచి తప్పుకు పోయిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరికొందరు ఆ పులి ఇంకా చిన్నగా ఉంది అది పూర్తిస్థాయిలో ఎదగలేదని, అందుకే ఎలుగుబంటికి భయపడిందని రాసుకొచ్చారు. అయితే ఎలుగుబంట్లు సాధారణంగా మనుషులను చూస్తే సిగ్గుపడతాయని.. కానీ వాటికి ప్రాణభయం కలిగినప్పుడు పులుల వంటి క్రూర మృగాలను సైతం ఎదురించేందుకు వెనకడవని మరో యూజర్ కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..


అయితే పులులు వేటాడడంలో నైపుణ్యం కలిగినవి అయినప్పటికీ.. అడవిలో మనుగడ సాగించే క్రమంలో అవి ఎప్పుడూ అనవసరమైన రిస్క్ తీసుకోవట. అంతేకాదు అనవసరంగా గాయాలు చేసుకోవడం వాటికి ఇష్టం ఉండదట.అయితే ఎలుగుబంట్లు మాత్రం తమ దూకుడు స్వభావంతో బలమైన శత్రువులను కూడా తరిమికొట్టడానికి ప్రయత్నిస్తాయట.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us