నడిరోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగిన రెండు పిల్లులు.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే నవ్వులు..

|

Jul 25, 2022 | 9:41 AM

Viral Video: గుర్రం, ఏనుగు, కుక్క, పిల్లి, కుందేలు సహా చాలా జంతువులను ప్రజలు పెంచుకుంటారు. అలాంటి పెంపుడు జంతువులు చాలా ఉన్నాయి.

నడిరోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగిన రెండు పిల్లులు.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే నవ్వులు..
Cats
Follow us on

Viral Video: గుర్రం, ఏనుగు, కుక్క, పిల్లి, కుందేలు సహా చాలా జంతువులను ప్రజలు పెంచుకుంటారు. అలాంటి పెంపుడు జంతువులు చాలా ఉన్నాయి. అయితే, ఎక్కువగా ప్రతీ ఇంట్లో కనిపించే కామన్ జంతువులు మాత్రం కుక్క, పిల్లి. వీటి మధ్య జాతి వైరం ఉన్నప్పటికీ.. ఒక్కసారి ఫ్రెండ్స్ అయ్యాయంటే వాటి బంధాన్ని ఎవరూ విడదీయలేనిదిగా ఉంటుంది. ఇదిలాఉంటే.. కొన్ని కొన్నిసార్లు సజాతి జీవులల్లోనే ఘర్షణలు తలెత్తుతాయి. తాజాగా అలాంటి పరిణామానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

ఈ వీడియోలో వాహనాల రద్దీ ఉండే రోడ్డుపైకి రెండు పిల్లులు వచ్చాయి. ఉన్నట్లుండి ఒకదానిపై ఒకటి దాడికి దిగాయి. గుర్రుమంటూ పొట్టు పొట్టుగా కొట్టున్నాయి. అయితే, ఇక్కడే ఒక ఫన్నీ మూమెంట్ చోటు చేసుకుంది. రెండు పిల్లులు తన్నుకుంటుంటే.. మధ్యలో ఓ కాకి దూరింది. కొట్టుకుంటున్న రెండు పిల్లుల్లో ఒకదానిపై అటాక్ చేసింది కాకి. అలా.. వాటి గొడవను ఇది ఛాన్స్‌గా తీసుకుని ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిల్లుల గొడవ, కాకి రచ్చను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..