Viral: ఉడుత చేసిన అల్లరి పని.. 3 వేల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!

|

Jun 25, 2022 | 9:43 AM

Viral: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉడుత చేసిన పని కారణంగా 3 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు అర్థగంటకు

Viral: ఉడుత చేసిన అల్లరి పని.. 3 వేల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!
Squirrel
Follow us on

Viral: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉడుత చేసిన పని కారణంగా 3 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు అర్థగంటకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అనేక కార్యక్రమాలకు నిలిచిపోయాయి. వ్యాపార, ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఉడత వల్ల కరెంట్ నిలిచిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ బాబూ నార్త్ కరోలినాకు చెందిన యుటిలిటీ కంపెనీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటానికి ఉడుత నే కారణమని ప్రకటించింది. ఆ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. జూన్ 22న ఉదయం ఒక ఉడుత పవర్ సప్లై వైరింగ్‌లోకి వచ్చి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించింది. దాంతో దాదాపు అరగంట పాటు డౌన్‌టౌన్‌లోని వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు, పౌరుల నివాసాలు సహా మొత్తం 3,000 మంది కస్టమర్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. కాగా, పవర్ సప్లయ్‌కి ఆటంకం కలిగిన వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. దాదాపు అరగంటపాటు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉడుత చేసిన పని కారణంగా.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు ఎఫెక్ట్ అయ్యాయని, ఇ-సేవల్లో డీడ్స్ రిజిస్టర్, ప్లానింగ్, ట్యాక్స్ కలెక్షన్స్, హెల్త్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పరిపాలన, కుటుంబ న్యాయ కేంద్రం, ఎన్నికల సేవలు, ఆర్థిక సేవలు ప్రభావితమయ్యాయని ఉత్తర కరొలినా విద్యుత్ సంస్థ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..