Viral: సాండ్‌విచ్ తినడానికి వెళ్లిన కస్టమర్‌కు గట్టి షాక్.. హోటల్ సిబ్బంది చేసిన పనికి వావ్ అనాల్సిందే!

Viral News: మనకి ఆకలి వేస్తే ఏం చేస్తాం.! హోటల్‌కి వెళ్తాం.. ఫుడ్ ఆర్డర్ చేస్తాం.. సర్వర్ ఫుడ్ తీసుకొస్తాడు.. చివరికి బిల్లు కట్టి బయటికి వస్తాం. ఇదంతా..

Viral: సాండ్‌విచ్ తినడానికి వెళ్లిన కస్టమర్‌కు గట్టి షాక్.. హోటల్ సిబ్బంది చేసిన పనికి వావ్ అనాల్సిందే!
Food Online

Updated on: Sep 28, 2021 | 1:50 PM

మనకి ఆకలి వేస్తే ఏం చేస్తాం.! హోటల్‌కి వెళ్తాం.. ఫుడ్ ఆర్డర్ చేస్తాం.. సర్వర్ ఫుడ్ తీసుకొస్తాడు.. చివరికి బిల్లు కట్టి బయటికి వస్తాం. ఇదంతా సర్వసాధారణం. అయితే ఇక్కడ ఓ వ్యక్తి బిల్లును వైరైటీగా చిల్లర నాణేలతో చెల్లించడంతో.. హోటల్ సిబ్బంది అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇక వచ్చిన ఆర్డర్‌ను చూసి అతగాడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అసలు ఆ కథేంటి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసి తన దగ్గరలోని రెస్టారెంట్‌కు వెళ్లి సాండ్‌విచ్ ఆర్డర్ చేశాడు. హోటల్ సిబ్బంది ఆర్డర్ తీసుకున్నారు. దానిని రెడీ కూడా చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ వ్యక్తి బిల్లును చిల్లర రూపంలో కట్టాడు. హోటల్ సిబ్బంది బిల్లు కట్టించుకున్నారు. ఇక ఆర్డర్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూసిన కస్టమర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అతడు ఆర్డర్ ఇచ్చిన సాండ్‌విచ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంది.

కస్టమర్ బిల్లును చిల్లర నాణేలతో కట్టడాని.. ఆ రెస్టారెంట్ అతడికి సాండ్‌విచ్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us