కళ్ల ముందే ఉన్నా కనిపెట్టలేరు.. ఈ ఫోటోలో తప్పును గుర్తిస్తే మీరే తోపు.. 99శాతం మంది ఫెయిల్..

మీ కళ్లు ఎంత పవర్ ఫుల్? మీ మెదడు ఎంత వేగంగా ఆలోచిస్తుంది? దీనికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వైరల్ పజిల్‌ను సాల్వ్ చేయాల్సిందే. 99 శాతం మంది నెటిజన్లు తలలు పట్టుకునేలా చేసిన ఈ వింత చిత్రంలో అసలు తప్పు ఎక్కడుందో తెలుసుకుంటే.. అరెరే.. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాం అని ముక్కున వేలేసుకుంటారు.

కళ్ల ముందే ఉన్నా కనిపెట్టలేరు.. ఈ ఫోటోలో తప్పును గుర్తిస్తే మీరే తోపు.. 99శాతం మంది ఫెయిల్..
Viral Mind Puzzle

Updated on: Jul 11, 2026 | 2:09 PM

మన కళ్ల ముందే నిజం కనిపిస్తున్నా కొన్నిసార్లు మన మెదడు దాన్ని గుర్తించలేదు. ఇలాంటి హ్యూమన్ సైకాలజీ ఆధారంగా రూపొందించిన ఒక మైండ్ పజిల్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘కేవలం మేధావులు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు.. 99 శాతం మంది ఇందులో ఫెయిల్ అయ్యారు’’ అంటూ నెటిజన్లకు సవాల్ విసురుతోందీ పోస్ట్. వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఒక గోడపై కొన్ని వ్యాఖ్యలు, 1 నుండి 10 వరకు అంకెలు రాసి ఉన్నాయి. దాని ముందు ఒక యువతి నిలబడి ఆ గోడ వైపు నిశితంగా చూస్తోంది. గోడపై ఇలా రాసి ఉంది..

“ONLY GENIUS PEOPLE CAN ANSWER”

“1 2 3 4 5 6 7 8 9 10”

“Can You Find The Mitsake?”

“99% failed”

అసలు ట్విస్ట్ ఏంటంటే..!

ఈ చిత్రాన్ని చూడగానే చాలా మంది 1 నుండి 10 వరకు ఉన్న అంకెల వైపు చూస్తూ.. అందులో ఏదైనా నెంబర్ మిస్ అయిందా? లేదా అంకెల క్రమంలో తేడా ఉందా? అని వెతకడం ప్రారంభిస్తారు. కానీ ఎంత వెతికినా నెంబర్లలో ఎలాంటి తప్పు కనిపించదు. ఎందుకంటే అసలైన తప్పు అంకెలలో లేదు, కింద రాసిన ఇంగ్లీషు వ్యాఖ్యంలో ఉంది. “Can You Find The Mitsake**?” అనే వాక్యంలో Mistake అనే పదానికి బదులుగా Mitsake అని తప్పు స్పెల్లింగ్‌తో రాశారు.

Viral Mind Puzzle

నెటిజన్ల రియాక్షన్

మన మెదడు సాధారణంగా అంకెలను లేదా పెద్ద అక్షరాలను వేగంగా స్కాన్ చేస్తుంది కానీ ఇలాంటి చిన్న చిన్న స్పెల్లింగ్ పొరపాట్లను అంత త్వరగా గుర్తించలేదు. అందుకే ఈ పజిల్‌ను చూసిన మెజారిటీ ప్రజలు మొదట అంకెల వైపే చూసి తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్చర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘నేను కూడా మొదట నెంబర్లనే చూశాను భయ్యా, అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు మొదటి చూపులోనే ఈ తప్పును కనిపెట్టగలిగారా? చెక్ చేసుకోండి..

Follow Us