చిన్నోడా.. నువ్వు చాలా గ్రేట్

| Edited By:

May 08, 2019 | 5:41 PM

కాబూల్ మారణహోమంలో తన కుడి కాలును కోల్పోయిన ఓ చిన్నారి, ఇప్పుడు కృత్తిమ కాలుతో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల సయ్యద్ అహ్మద్ రెహ్మాన్ అనే ఈ బాలుడు తన ఎనిమిది నెలల వయసులో.. కాబూల్‌లో జరిగిన మందు పాతర పేలుడులో కాలును కోల్పోయాడు. రెడ్‌క్రాస్ సంస్థ వారి సహాయంతో ఇటీవల రెహ్మాన్‌కు కృత్తిమ కాలును అమర్చారు. దీంతో మొట్టమొదటిసారిగా తనకు కాలు వచ్చిందంటూ అహ్మద్ సంతోషంతో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ […]

చిన్నోడా.. నువ్వు చాలా గ్రేట్
Follow us on

కాబూల్ మారణహోమంలో తన కుడి కాలును కోల్పోయిన ఓ చిన్నారి, ఇప్పుడు కృత్తిమ కాలుతో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల సయ్యద్ అహ్మద్ రెహ్మాన్ అనే ఈ బాలుడు తన ఎనిమిది నెలల వయసులో.. కాబూల్‌లో జరిగిన మందు పాతర పేలుడులో కాలును కోల్పోయాడు. రెడ్‌క్రాస్ సంస్థ వారి సహాయంతో ఇటీవల రెహ్మాన్‌కు కృత్తిమ కాలును అమర్చారు. దీంతో మొట్టమొదటిసారిగా తనకు కాలు వచ్చిందంటూ అహ్మద్ సంతోషంతో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అతని ముఖంలో చిరునవ్వు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.. ఈ దృశ్యం చూసిన అందరిలో భావోద్వేగంతో కళ్లు చెమర్చాయి. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ బాలుడు దివ్యాంగులకు స్ఫూర్తిని ఇస్తున్నాడని, అతడి ముఖంలో కనిపించిన సంతోషమే.. అతని విజయానికి పునాది అవుతుందని ఆశిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.