ఆ బాబును దేవుడే కాపాడాడు..ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్

|

Aug 22, 2019 | 7:58 PM

నిజంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పైనుంచి కారు పోయినా సురక్షితంగా బయటపడ్డాడు ఓ బాలుడు. సూరత్‌లోని ఓ కాలనీలో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని బయటకు వచ్చాడు ఓ ఏడేళ్ల కుర్రాడు. నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి కూర్చొని అక్కడ పారుతున్న వర్షపు నీటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడో వ్యక్తి కారు రివర్స్​లో వెనక్కి తీసుకొచ్చాడు. గొడుగు కిందున్న చిన్నారిని గమనించని డ్రైవర్ చిన్నారిపైనుంచే కారును పోనిచ్చేశాడు. పక్కనున్న వాళ్లు […]

ఆ బాబును దేవుడే కాపాడాడు..ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్
Follow us on

నిజంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పైనుంచి కారు పోయినా సురక్షితంగా బయటపడ్డాడు ఓ బాలుడు. సూరత్‌లోని ఓ కాలనీలో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని బయటకు వచ్చాడు ఓ ఏడేళ్ల కుర్రాడు. నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి కూర్చొని అక్కడ పారుతున్న వర్షపు నీటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడో వ్యక్తి కారు రివర్స్​లో వెనక్కి తీసుకొచ్చాడు. గొడుగు కిందున్న చిన్నారిని గమనించని డ్రైవర్ చిన్నారిపైనుంచే కారును పోనిచ్చేశాడు. పక్కనున్న వాళ్లు అలర్ట్ అయ్యి బాలుడు కారు కింద ఉన్నాడని సిగ్నల్స్ ఇవ్వడంతో .. అప్రమత్తమై వాహనాన్ని ఆపాడు.గొడుగు పూర్తిగా ధ్వంసం అయ్యింది గానీ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదు. సురక్షితంగా తిరిగొచ్చిన బిడ్డను హత్తుకుంది ఆ బుడ్డోడి తల్లి. సీసీటీవీల్లో రికార్డయిన ఈ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.