ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో గంగానది పొంగిపొర్లి ప్రవహిస్తోంది. కాగా హరిద్వార్‌లో ప్రస్తుతం కన్వర్ యాత్ర జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి కన్వరియన్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కంగ్రా ఘాట్‌లో పవిత్ర గంగానదిలో దిగిన విశాల్ అనే భక్తుడు బ్యాలెన్స్ తప్పి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి దూకేశాడు. నదీ ప్రవాహాన్ని లెక్క చేయకుండా విశాల్ దగ్గరకు చేరుకొని అతడిని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు నిజంగా హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే గంగానదిలో ప్రవాహం ఉధృతంగా ఉందని.. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ యాత్రలో పనిచేసే పోలీసులు కన్వరియన్లను హెచ్చరిస్తున్నారు.
हरियाणा निवासी विशाल #haridwar स्थित कांगड़ा घाट पर नहाने गया था। तभी उसका पैर फिसला और वह गंगा के तेज बहाव में बहने लगा है। इसी दौरान वहां मौजूद #UttarakhandPolice के जवान #सन्नी की नजर उस पर पड़ी। सन्नी ने तत्काल गंगा में कूदकर युवक को कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया। pic.twitter.com/g1qhBYKhlF
— Uttarakhand Police (@uttarakhandcops) July 20, 2019