Watch Video: ఇదేం రీల్స్‌ పిచ్చి అక్కా.. పోలీసులనే ముప్పతిప్పలు పెట్టిన యువతి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుత సోషల్‌ మీడియాలో యుగంలో యువతకి రీల్స్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ రీల్స్‌ కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువతి.. పోలీస్‌ స్టేషన్‌ ముందు రీల్‌ చేసింది. ఆ రీల్‌ కాస్తా వైరల్‌ అయ్యింది. దీంతో ఆ రీల్‌ డిలీట్‌ చేయమని సదురు యువతి ఇంటికి వెళ్లి పోలీసులకు ఆమె షాక్‌ ఇచ్చింది. ఇంతకు ఆమె ఏం చేసిందనేగా మీ డౌట్‌ అయితే తెలుసుకుందాం పదండి.

Watch Video: ఇదేం రీల్స్‌ పిచ్చి అక్కా.. పోలీసులనే ముప్పతిప్పలు పెట్టిన యువతి.. అసలు ఏం జరిగిందంటే?
Up Viral Video

Updated on: Sep 20, 2025 | 5:19 PM

ప్రస్తుత సోషల్‌ మీడియాలో యుగంలో యువతకి రీల్స్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది. సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు కొందరు ప్రమాదకర రీల్స్‌ చేస్తుంటే.. మరి కొందరు ఈ రీల్స్ కోసం ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. పోలీస్‌ స్టేషన్‌ ముందు చేసిన రీల్‌ను డిలీచ్‌ చేయమన్నందుకు ఒక యువతీ పోలీసులతోనే ఘర్షణకు దిగింది. నేను ప్రాణాలైనా వదిలేస్తా కానీ.. రీల్‌ మాత్రం డిలీట్‌ చేయనని వారితో వాగ్వాధానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకికి చెందిన రుహి ఖాన్ అనే యువతీ ఇటీవల బద్దూపూర్ పోలీస్ స్టేషన్ గేట్ వద్ద ఒక రీల్‌ చేసి.. దానికి భోజ్‌పురి పాటను సెట్‌చేసి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే దీన్ని గమనించిన పోలీసులు.. ఈ వీడియోను సోషల్‌ మీడియాలోంచి తొలగించాలని సదురు యువతి ఇంటికి వెళ్లారు. అయితే ఆ యువతి మాత్రం తన రీల్‌ను తొలగించేందుకు నిరాకరించింది. ఈ విషయంపై పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

నా వీడియోకు మిలియన్ కంటే ఎక్కువ వీవ్స్‌ వచ్చాయని.. నేను నా ప్రాణాలనైనా వదులుకుంటాను కానీ.. వీడియో మాత్రం తొలగించను” అని ఆ యువతి తేల్చి చెప్పింది. వీడియో తొలగించాలని ఒత్తిడి తీసుకొస్తే.. కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించింది. దీంతో చేసేదేమి లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రీల్‌ తొలగించమన్న పోలీసులను యువతి బెదిరిస్తున్న వీడియో

పోలీస్‌ స్టేషన్‌ ముందు యువతి రీల్‌ చేసిన వీడియో

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.