అమెరికాలో భారతీయ విద్యార్థికి షాక్! వెంబడించి మరీ వేధింపులు!

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో భారతీయ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తనను జాత్యహంకార వ్యాఖ్యలతో దూషించడమే కాకుండా.. వెంబడించి, తోసివేశాడని విద్యార్థి ఆరోపించాడు. ఈ ఘటనతో విద్యార్థి ప్రాణభయంతో వణికిపోయాడు. సెప్టెంబర్‌ 17న చోటుచేసుకున్న ఘటనను "హేట్ క్రైమ్ దాడి''గా నమోదు చేసింది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పబ్లిక్ సేఫ్టీ విభాగం.

అమెరికాలో భారతీయ విద్యార్థికి షాక్! వెంబడించి మరీ వేధింపులు!
University Of Florida Student Faces Anti Indian Racism Heat

Updated on: Sep 30, 2026 | 5:21 PM

‘లుక్ ఎట్ దిస్ ఇండియన్’ అంటూ తనను ఓ అమెరికన్ వేధించాడని రెడిట్‌లో సదరు విద్యార్థి వివరాలు వెల్లడించాడు. అర్ధరాత్రి సమయంలో మార్స్్టన్ ప్రాంతం నుంచి తిరిగి వస్తూ వావా వద్ద ఆగి, తిరిగి క్యాంపస్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు విద్యార్థి. అదే సమయంలో ఓ వ్యక్తి అతడి దగ్గరకు వచ్చి ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.

‘‘లుక్ ఎట్ దిస్ ఇండియన్..’’ అంటూ తనను అసభ్యకరమైన జాత్యహంకార పదాలతో దూషించాడని విద్యార్థి రెడిట్‌ పోస్ట్‌ లో తెలిపాడు. తాను అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి తనను వెంబడిస్తూ దూషణలు కొనసాగించాడని తెలిపాడు. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన సమయంలో తనకు ఎదురుగా నిలబడి దగ్గరకు వచ్చి బలంగా తోసేశాడని ఆరోపించాడు.

బ్యాగ్ లాక్కునేందుకు ప్రయత్నం

ఆ తర్వాత తను వేగంగా నడవడం ప్రారంభించానని విద్యార్థి రాసుకొచ్చాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి తనను వెంబడిస్తూ.. బ్యాగ్‌లో ఏముందో చూద్దామంటూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడట. అతడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు బ్యాగ్‌ను పక్కకు లాగానని, ఆ సమయంలో భద్రత కోసం తాను కూడా వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించానని విద్యార్థి తెలిపాడు. ఆ వ్యక్తి తనను ఆత్మహత్య చేసుకోవాలని కూడా దూషించాడని ఆరోపించాడు.

‘ప్రాణాలకు భయపడ్డాను’

‘‘అతడు నాపై దాడి చేయడానికి ముందు నేను నిజంగానే నా ప్రాణాల గురించి భయపడ్డాను. అక్కడి నుంచి వెళ్లిపోకుండా అతడు నన్ను అడ్డుకున్నాడు’’ అని విద్యార్థి పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థి తనను వేధిస్తున్న వ్యక్తిని రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత అతడు మరింత ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై విద్యార్థి యూనివర్సిటీకి ఫిర్యాదు చేసినట్లు, వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు రెడిట్‌లో ఈ కేసు పై అప్ డేట్ ను పలువురు అందించారు. అయితే ఈ వివరాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us