Viral News: బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్… నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలు పడడం రెగ్యూలర్‌గా చూస్తూనే ఉంటాం. హీరో లెవల్‌లో కోట్లాడటం, అవసరమైతే...

Viral News: బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్... నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది
Fight For Boy Friend

Updated on: Aug 13, 2021 | 3:26 PM

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలు పడడం రెగ్యూలర్‌గా చూస్తూనే ఉంటాం. హీరో లెవల్‌లో కోట్లాడటం, అవసరమైతే గ్యాంగ్ వార్స్‌కు తెగబడిన సందర్భాలు.. అమ్మాయి కోసం సినిమాటిక్ ఫైట్స్ చేయడం వంటివి నిజ జీవితంలోనూ మనకి తారసపడుతుంటాయి. కానీ ఒక యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు మీద జుట్టూ.. జుట్టూ పట్టుకున్నారు. నడిరోడ్డు మీదనే సిగపట్లుతో కుస్తీ పట్టారు. ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో జరిగింది ఘటన. ఈ సీన్‌ మొత్తం కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వైరల్‌గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో తిరగడాన్ని అమ్మాయి సహించలేకపోయింది. వారు ఎదురుగా కనిపించడంతో కోపం నషాలానికి అంటింది. అంతే.. తోక తొక్కిన తాచుపాములా విరుచుకుపడింది. మార్కెట్ లో అందరూ చూస్తుండగానే యువతి జుట్టు పట్టుకుంది, పిడిగుద్దులతో బెంబేలెత్తించింది. నాలుగు దెబ్బలు పడగానే.. అవతలి అమ్మాయి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిఘటించి.. ఎదురు దాడికి దిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కింద పొర్లాడుతూ కొట్టుకున్నారు. బాక్సింగ్ మాదిరి పంచులతో రోడ్డుని బాక్సింగ్ రింగ్ చేసేశారు. ఇది చూసిన వారు ముక్కు మీద వేలేసుకున్నారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో యువతులతో పాటు యువకుడు సైతం కాళ్లకు పని చెప్పారు. ఉన్నపళంగా అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ ఘటన అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉండగా.. స్థానికంగా ఉన్నవారిని కాసేపు టెన్షన్‌కు గురిచేసింది.

వీడియో దిగువన వీక్షించండి

Also Read:ఆ విగ్రహం ఇంట ఉంటే దరిద్రం వదులుతుంది, సిరుల పంటే అంటారు.. కొంటే సీన్ సితారే

హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి

Loading...
Unable to load recommendations.
Follow Us