Viral: ఓరి నాయనో.. చేప అనుకుని పామును తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Aug 13, 2024 | 8:13 PM

చేప వేరు.. పాము వేరు.. వీటిని మనం ఈజీగానే గుర్తుపట్టొచ్చు.. అయితే.. కొన్ని చేపలు అచ్చం పాములు మాదిరిగా ఉంటాయి.. వాటిని అంతగా గుర్తుపట్టలేరు.. అయితే.. ఇద్దరు పిల్లలు ఈ పామును గుర్తించలేదు.. చేప అనే అనుకున్నారు.. చనిపోయిన పాము కనిపిస్తే చేప అనుకుని.. దానిని తీసుకెళ్లి మంచిగా కాల్చి తినడం ప్రారంభించారు..

Viral: ఓరి నాయనో.. చేప అనుకుని పామును తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Viral News
Follow us on

చేప వేరు.. పాము వేరు.. వీటిని మనం ఈజీగానే గుర్తుపట్టొచ్చు.. అయితే.. కొన్ని చేపలు అచ్చం పాములు మాదిరిగా ఉంటాయి.. వాటిని అంతగా గుర్తుపట్టలేరు.. అయితే.. ఇద్దరు పిల్లలు ఈ పామును గుర్తించలేదు.. చేప అనే అనుకున్నారు.. చనిపోయిన పాము కనిపిస్తే చేప అనుకుని.. దానిని తీసుకెళ్లి మంచిగా కాల్చి తినడం ప్రారంభించారు.. ఈ క్రమంలోనే.. పిల్లలు తింటుండగా వారి తల్లి ..అటుగా ఓ కన్నేసింది.. ఏందోనని చూసి.. పాముగా గుర్తించింది.. ఆ తర్వాత.. వారిద్దరిని పాముల సంరక్షుడి వద్దకు తీసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ పాము విషపూరితమైనది కాకపోవడంతో.. చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు పిల్లలు చేప అనుకుని చనిపోయిన పామును కాల్చుకుని తిన్న ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని రాంనగర్‌ పుచ్చడి నాయి గ్రామంలో ఓ కుటుంబం ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలోనే.. ఆ కుటుంబానికి చెందిన 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు (బాలురు).. చనిపోయిన పామును చేప అనుకుని తీసుకువచ్చారు.. అనంతరం కాల్చారు. దాన్ని తింటున్న సమయంలో అక్కడికి వచ్చిన వారి తల్లి.. పాము అని చెప్పి దానిని విసిరేసింది. అనంతరం కుటుంబసభ్యులు కంగారుతో చిన్నారులను పాముల సంరక్షుడు తాలిబ్ హుస్సేన్ వద్దకు తీసుకెళ్లారు.

అయితే.. వారిని పరిశీలించిన సంరక్షుడు.. పాము కాటు వేస్తే ఉపయోగించే మూలికలను ఇద్దరు చిన్నారులకు ఇచ్చాడు. పామును కూడా పరిశీలించారు.. అయితే.. ఇద్దరు పిల్లలు తిన్న పాము విషపూరితమైనది కాదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారు పాము తల తినకపోవడం మంచిదైందని.. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని తాలిబ్ హుస్సేన్ తెలిపాడు.. చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే.. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించాలని.. నాటు వైద్యం ప్రమాదకరంగా మారుతుందని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.. చిన్నారులు తెలియక పామును పట్టుకుని వచ్చారని.. అదే బతికున్న పామును పట్టుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..