చిట్టి చెల్లి కోసం.. పుట్టెడు కష్టం.. బుడ్డోడు గట్టోడే..!

| Edited By: Pardhasaradhi Peri

Sep 17, 2019 | 3:16 PM

తన చిట్టి చెల్లెలు ఆకలిని గమనించిన ఓ బుడ్డోడు తానే అమ్మగా మారిపోయాడు. పెద్ద గరిట సైజ్‌ కూడా లేని ఆ పిల్లాడు తన చేతికి సరిపోయే గరిటను పట్టి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేశాడు. ఆ తరువాత తానే సొంతంగా తన చెల్లికి తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలీదు కానీ ఫెస్ అనే ఓ నెటిజన్ ఇటీవల […]

చిట్టి చెల్లి కోసం.. పుట్టెడు కష్టం.. బుడ్డోడు గట్టోడే..!
Follow us on

తన చిట్టి చెల్లెలు ఆకలిని గమనించిన ఓ బుడ్డోడు తానే అమ్మగా మారిపోయాడు. పెద్ద గరిట సైజ్‌ కూడా లేని ఆ పిల్లాడు తన చేతికి సరిపోయే గరిటను పట్టి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేశాడు. ఆ తరువాత తానే సొంతంగా తన చెల్లికి తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఎక్కడ తీశారో తెలీదు కానీ ఫెస్ అనే ఓ నెటిజన్ ఇటీవల దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అందులో మొదట ఓ ప్యాన్‌లో గుడ్డు, తరువాత కొన్ని టమాటాలు, అన్నం, ఉప్పు, కొత్తిమీరతో పాటు కొన్ని పదార్థాలను వేసిన బుడ్డోడు చివరకు అద్భుతమైన ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను చేశాడు. ఆ తరువాత దాన్ని రెండు గిన్నెల్లో పెట్టుకొని తన చెల్లి దగ్గరకు తీసుకెళ్లి ఆమెకు తినిపించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వాడి టాలెంట్‌, చెల్లిపై చూపించే ప్రేమకు ముగ్ధులవుతూ.. ‘వావ్’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘బుడ్డోడా నువ్వు అదుర్స్’ అంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

https://twitter.com/FOODFESS2/status/1172166939176620032?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1172166939176620032&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Ftoddler-cooks-nasi-goreng-for-his-little-sister-feeds-her-viral-video-wins-the-internet-1599814-2019-09-16