Viral Video: ఈ చింపాంజీ స్టైలే వేరప్ప..! సూర్యుడికే సవాల్ చేసింది.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..

| Edited By: Ravi Kiran

Mar 29, 2022 | 7:44 AM

Chimpanzee Viral Video: వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు తెలివైనవి. రెండూ కూడా ఒకేలా ఉంటాయి.

Viral Video: ఈ చింపాంజీ స్టైలే వేరప్ప..! సూర్యుడికే సవాల్ చేసింది.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..
Chimpanzee
Follow us on

Chimpanzee Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలు తెలివైనవి. రెండూ కూడా ఒకేలా ఉంటాయి. వాస్తవానికి అవి రెండు వేర్వేరు. అయితే.. చింపాంజీల వ్యవహారశైలి అచ్చం మనషుల్లానే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో దీన్ని నిరూపితం చేస్తోంది. చింపాజీ తీరు అచ్చం మనిషిలానే ఉంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో చింపాంజీ ఎండ నుంచి రక్షణ పొందుతూ కనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను చూసి (Social Media) నెటిజన్లు నవ్వుకోవడంతోపాటు బ్రిలియంట్ చింపాంజీ అంటూ అభినందిస్తున్నారు.

ఈ వీడియోలో ఒక చింపాంజీ చేతుల్లో కొన్ని పండ్లు, కూరగాయలు కనిపిస్తున్నాయి. అయితే.. ఎండలు మండుతుండటంతో.. సూర్యుని తాపం నుంచి బయటపడేందుకు అది వాటిని వినియోగిస్తుంది. నమ్మడం లేదు కదా.. చింపాంజీ తన చేతిలో ఉన్న క్యాలీ ఫ్లవర్ ఆకులను తలపై టోపీలా పెట్టుకుంటూ కనిపించింది. ఒకసారి తిని వాటిని నెత్తిపై పెట్టుకొని దర్జాగా నడుస్తూ.. చింపాజీ కనిపించింది. సూర్యుడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు చింపాంజీ అనుసరిస్తున్న స్టైల్ చూసి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. చింపాజీ స్టైల్ మామూలుగా లేదంటూ ఫన్నీ కామెంట్లు చేస్తూ మళ్లీ మళ్లీ వీడియోను వీక్షిస్తున్నారు.

వైరల్ వీడియో.. 

ఈ వైరల్ వీడియోను ట్విట్టర్‌లో Buitengebieden అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చింపాంజీ ఆలోచనలు అచ్చం మనుషుల్లాగే ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: తగ్గేదేలే.. చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ.. వైరలవుతోన్న వీడియో..

Watch Video: సిద్దిపేట జిల్లాలో వింత ఘటన.. పాలు తాగుతున్న పార్వతిదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తజనం..