Viral Video: పురాతన ఇంట్లో లక్షలాది విషపూరిత తేళ్లు.. ధైర్యముంటేనే వీడియో చూడాలంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ షాకింగ్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు అశ్చర్యానికి గురి చేస్తే, మరి కొన్ని భయానకంగా ఉంటాయి.

Viral Video: పురాతన ఇంట్లో లక్షలాది విషపూరిత తేళ్లు.. ధైర్యముంటేనే వీడియో చూడాలంటున్న నెటిజన్లు..
Scorpions

Updated on: May 14, 2022 | 1:27 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ షాకింగ్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు అశ్చర్యానికి గురి చేస్తే, మరి కొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా బయటపడిన ఓ వీడియో ఒళ్లు గగుర్పాటు కలిగిస్తోంది. భయంకరమైన జంతువులకు భయపడి తమను తాము రక్షించుకోవాడానికి ప్రయత్నిస్తుంటారు మనుషులు. అయితే, అదే రీతిలో జంతువులు సైతం ఇతర ప్రాణుల నుంచి తమని తాము రక్షించుకోవాలని చూస్తుంటాయి. ఈ క్రమంలో పరిమాణంలో చిన్నవైన విషపూరిత తేళ్లు అన్నీ ఒకే చోట చేరితే.. అవన్నీ ఓ ఇంట్లో దూరితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మనకు సాధారణంగా కనిపించే తేళ్ల విషం అంత ప్రాణాంతకం కాదు. అదే సమయంలో నిద్రపోవడానికి నిత్య ఒక చుక్క తేలు విషం సేవించే వ్యక్తులు కూడా ఉన్నారు. తేళ్లను విషపూరితమైనవిగా భావించి వాటిని చంపడం లేదా వాటి నుండి తమను తాము రక్షించుకోవడం చూస్తుంటాం. ఒక ఇంటి నేలమాళిగలో వందలాది తేళ్లు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లక్షలాది తేళ్లు నేలమాళిగలో అన్ని చోట్లా ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మేలేమంటూ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆ తేళ్లన్నీ విషపూరితమైనవని, వాటి విషం కోసం మాత్రమే వాటిని పెంచుతూ ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని మందులు తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉండవచ్చని అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us