Watch: ఉద్యోగం మానేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి..!

ఉద్యోగంలో అసంతృప్తి, అలసట సహజమే. అయితే, ఉద్యోగం మానేసే ముందు ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ వాస్తవాలను అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు వేల దరఖాస్తులు పంపి, ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థిరమైన ఉద్యోగం ఉండటం ఒక గొప్ప అవకాశం, దీని విలువను గుర్తించి, తొందరపడకుండా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

Watch: ఉద్యోగం మానేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి..!
Mridul Gupta, Mumbai

Updated on: Aug 22, 2026 | 8:22 PM

సోమవారం ఉదయం అలారం మోగగానే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఆఫీస్‌నే. అదే పని, అదే ట్రాఫిక్, అదే డెడ్‌లైన్లు, అదే ఒత్తిడి.. దీంతో ‘‘ఈరోజు ఆఫీస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండు’’ అనే ఆలోచన రావడం సహజమే. ఉద్యోగం విషయంలో అప్పుడప్పుడు విసుగు, అసంతృప్తి, అలసట కలగడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఉద్యోగం ఉన్నవారు దాని విలువను మరోసారి ఆలోచించుకునేలా చేస్తోంది.

ముంబైకి చెందిన మృదుల్ గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యోగంపై చిన్న అసంతృప్తికే దాన్ని వదిలేయాలనే నిర్ణయం తీసుకునే ముందు బయట పరిస్థితులను కూడా గమనించాలని సూచించారు. ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మృదుల్ తెలిపారు.

ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. కొందరు రోజుకు 50 వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే.. మరికొందరు 100కు పైగా కంపెనీలకు రెజ్యూమేలు పంపుతున్నారని పేర్కొన్నారు. దరఖాస్తులు పంపిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటోందన్నారు.

మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ తిరస్కరణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ అనుభవానికి సరిపోని జూనియర్ స్థాయి ఉద్యోగాలకు కూడా ఎంపిక కాకపోవడం, కంపెనీల నుంచి సరైన ఫీడ్‌బ్యాక్ రాకపోవడం వంటి పరిస్థితులు ఉన్నాయని వివరించారు.

అయితే ఉద్యోగం పట్ల విసుగు చెందడాన్ని మాత్రం మృదుల్ తప్పుపట్టలేదు. ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లడం, పనులను గడువులోగా పూర్తి చేయడం, ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల అలసట రావడం సహజమేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో స్థిరమైన ఉద్యోగం ఉండటం కూడా ఒక విలువైన విషయం అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకుంటే.. మనకు ఉన్న అవకాశాన్ని మరింత బాధ్యతగా చూడగలమని మృదుల్ గుప్తా పేర్కొన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొందరు ఉద్యోగ ఒత్తిడిని గుర్తుచేసుకుంటుండగా.. మరికొందరు ‘‘ఉద్యోగం విలువ తెలియాలంటే ఉద్యోగం లేని వారి పరిస్థితి చూడాలి’’ అంటూ వీడియో మెసెజ్‌లతో ఏకీభవిస్తున్నారు.

మొత్తానికి.. ఉద్యోగంపై అసంతృప్తి రావడం సహజమే. కానీ నిర్ణయం తీసుకునే ముందు మన పరిస్థితి మాత్రమే కాకుండా ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ పరిస్థితిని కూడా ఒకసారి ఆలోచించాలి అన్నదే ఈ వైరల్ వీడియో ఇచ్చే ప్రధాన సందేశం.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us