సముద్రంలో ఐఫోన్‌.. తిరిగి తెచ్చిన వేల్..

| Edited By:

May 10, 2019 | 12:42 PM

రష్యన్ గూఢచార తిమింగలం అద్భతం చేసింది. ఎవరూ ఊహించని సహాయం చేసింది. నార్వేలోని హెమ్మెర్పెస్ట్ హార్బర్ వద్ద జరిగిన ఈ విచిత్రం వావ్ అనిపిస్తోంది. ఐసా ఓప్డాల్ అనే మహిళ తన స్నేహితులతో కలిసి సముంద్రంలోని బోట్‌లో ప్రయాణిస్తోండగా.. అకస్మాత్తుగా ఆమె ఐఫోన్ బ్యాగులోంచి నీటిలో పడిపోయింది. ఇంక అంతే.. తన ఫోన్ పోయినట్టేనని ఉసూరమంది ఆమె. అయితే.. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళకు కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. నీటిలోంచి ఓ […]

సముద్రంలో ఐఫోన్‌.. తిరిగి తెచ్చిన వేల్..
Follow us on

రష్యన్ గూఢచార తిమింగలం అద్భతం చేసింది. ఎవరూ ఊహించని సహాయం చేసింది. నార్వేలోని హెమ్మెర్పెస్ట్ హార్బర్ వద్ద జరిగిన ఈ విచిత్రం వావ్ అనిపిస్తోంది. ఐసా ఓప్డాల్ అనే మహిళ తన స్నేహితులతో కలిసి సముంద్రంలోని బోట్‌లో ప్రయాణిస్తోండగా.. అకస్మాత్తుగా ఆమె ఐఫోన్ బ్యాగులోంచి నీటిలో పడిపోయింది. ఇంక అంతే.. తన ఫోన్ పోయినట్టేనని ఉసూరమంది ఆమె.

అయితే.. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళకు కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. నీటిలోంచి ఓ వేల్ బయటకొచ్చి.. నీటిలో పడిపోయిన ఆమె ఐఫోన్‌ను నోటితో తెచ్చి అందించడంతో ఆమె ఆనందానికి అంతేలేకపోయింది. ఆమె ఈ వీడియోని తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. వెంటనే 19 వేల లైక్స్ వచ్చి పడ్డాయి.

నార్వే సిటీని అమితంగా ఇష్టపడుతున్న ఈ తెల్ల జాతి బెలూగా తిమింగలం రోజు రోజుకీ మనుషులకి మాలిమి అవుతూ వారి ఆదరణను చూరగొంటోంది.

రష్యాలోని సెయింట్ పిటర్స్ వద్ద ఆ దేశ నేవీ తమ గూఢాచార కార్యకలాపాల కోసం ఈ వేల్‌ను వినియోగించుకుంటోంది. దానికి కెమెరాతో కూడిన ఓ పట్టీని కట్టి తమ దగ్గరి దేశాల సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు సముద్రంలో దీన్ని పంపుతున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే.. తాము అలాంటి చర్యలకు పాల్పడలేదని ఈ తిమింగలం తమ స్పై కాదని రష్యన్ నేవీ ఖండించింది.