Viral Photo: ఈ ఫోటోలో ఓ జంతువు దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!

|

Dec 25, 2021 | 12:37 PM

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులోనూ కొన్ని పజిల్స్‌లాగ తలపించే చిత్రాలైతే వీక్షకులను...

Viral Photo: ఈ ఫోటోలో ఓ జంతువు దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!
Viral
Follow us on

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులోనూ కొన్ని పజిల్స్‌లాగ తలపించే చిత్రాలైతే వీక్షకులను భలేగా ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిల్లో అసలేం దాగుంది.? ఎక్కడుందో గుర్తించేందుకు తలలు పట్టుకోవాలి. దాన్ని తీక్షణంగా చూస్తేనే గానీ మనం గుర్తించలేం. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మొత్తం మరో ఎత్తు. ఇలాంటివి నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అసలు విషయానికి వస్తే.. పైన పేర్కొన్న ఫోటోలో ఓ జంతువు దాగుంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. అయితే మొదటిగా మనం ఆ చిత్రాన్ని చూసినప్పుడు అదొక చెట్టు బెరడు అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఓ పురుగు ఉంది. కాస్త తీక్షణంగా కళ్లకు పదును పెట్టి చూస్తేనే గానీ కనబడదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా అందులో ఏముందో కనిపెట్టండి మరి. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.