నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్.. అసలేం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

సాధారణంగా మొగుడు దారి తప్పితే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? జుట్టు పట్టుకుని లాగుతుంది లేదా కోర్టుకీడ్చి విడాకులు అడుగుతుంది. కానీ ఈ థాయిలాండ్ భార్య రూటే వేరు.. నీకు నా మొగుడు కావాలి.. నా మొగుడికి నువ్వు కావాలి.. ఇంకెందుకు ఆలస్యం, మా ఆయన్ని నీకు అద్దెకు ఇస్తా, నెల నెలా రెంట్ కట్టేయ్ అంటూ ప్రియురాలికే బంపర్ ఆఫర్ ఇచ్చింది.

నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్.. అసలేం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Thai Wife Rents Husband To Mistress
Image Credit source: AI Generated Photo

Updated on: Mar 15, 2026 | 9:40 PM

సాధారణంగా భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? నిలదీస్తుంది, గొడవ పడుతుంది లేదా విడాకులు ఇచ్చి విడిపోతుంది. కానీ థాయిలాండ్‌లో ఒక భార్య మాత్రం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తన భర్తను తనతోనే ఉంచుకోవాలని ఆశపడుతున్న ప్రియురాలికి.. నా భర్తను నీకు అద్దెకు ఇస్తా, నెలకు ఇంత మొత్తం కట్టు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రేమ.. ఎనిమిదేళ్ల కాపురం

ఖున్ క్వాంగ్ అనే మహిళకు, ఒక పోలీస్ అధికారికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల బిడ్డ కూడా ఉన్నాడు. 2025 మధ్యకాలం వరకు వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే తన భర్త సోషల్ మీడియాను ఒక అపరిచిత మహిళ నిరంతరం ఫాలో అవ్వడం గమనించిన క్వాంగ్‌కు అనుమానం మొదలైంది. భర్త ప్రవర్తనలో మార్పు రావడం, ఇంటికి ఆలస్యంగా రావడం వంటివి చూసి ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను రంగంలోకి దించింది. డిటెక్టివ్ దర్యాప్తులో భర్త మరో మహిళతో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు తేలింది. అంతటితో ఆగకుండా ఆ భర్త ఒకరోజు ఇంటికి వచ్చి.. “నాకు ఈ సంసారం వద్దు, నువ్వూ వద్దు. ఇల్లు, కారు, అప్పులు అన్నీ నీవే.. నేను వెళ్ళిపోతున్నా” అని భార్యకు షాకిచ్చాడు. అయితే క్వాంగ్ అతడిని హెచ్చరించి తిరిగి ఇంటికి వచ్చేలా చేసింది.

భార్య మాస్టర్ ప్లాన్

కొన్ని రోజుల తర్వాత ఆ భర్త రాత్రిపూట నిద్రలేచి.. ‘‘నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను, ఆమె లేకపోతే ఉండలేను’’ అని భార్య ముందే ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు క్వాంగ్‌కు ఒక ఆలోచన వచ్చింది. ఆ ప్రియురాలికి ఫోన్ చేసి ఒక వింతైన ఒప్పందాన్ని ముందు పెట్టింది. ‘‘నీకు నా భర్త కావాలి కదా? అయితే అతడిని నీకు అద్దెకు ఇస్తాను. నెలకు 30,000 బాట్ (సుమారు రూ. 85,000) నాకు చెల్లించు. అతను నీ దగ్గరే ఉండొచ్చు. కానీ నేను విడాకులు మాత్రం ఇవ్వను’’ అని క్వాంగ్ ప్రతిపాదించింది. ఈ ఆఫర్‌కు ఆ ప్రియురాలు కూడా డబ్బు సమస్య కాదు, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడం గమనార్హం.

చట్టం ఏమంటోంది?

ఈ వింతైన హజ్బెండ్ లీజ్ అగ్రిమెంట్ థాయిలాండ్‌లో వైరల్‌గా మారింది. దీనిపై న్యాయ నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి ఒప్పందాలకు చట్టపరమైన గుర్తింపు ఉండదని స్పష్టం చేశారు. ఏకపత్నీవ్రత చట్టాల ప్రకారం ఇలాంటివి చెల్లవని తెలిపారు. చివరికి క్వాంగ్ ఆ ప్రియురాలిపై కోర్టులో దావా వేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us