అమ్మ బర్త్‌డే నంబర్‌తో రూ. 240 కోట్ల లాటరీ గెలుచుకున్న తెలంగాణ కుర్రాడు.. కోటీశ్వరుడయ్యాక ఏం చేశాడంటే!

అబుదాబిలో ఐటీ ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన అనిల్ కుమార్ బొల్లా అనే 29 ఏళ్ల యువకుడు యూఏఈ లాటరీలో ఏకంగా రూ. 240 కోట్లు (100 మిలియన్ దిర్హామ్‌లు) గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. తన తల్లి పుట్టినరోజు తేదీ ఆధారంగా 11 అనే సంఖ్యను ఎంచుకోవడమే అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ భారీ మొత్తంతో భారతదేశం, యూఏఈలలో ఆస్తులు కొనుగోలు చేశాడు. విదేశీ పర్యటనలు చేసినప్పటికీ చివరకు ఏం చేశాడంటే..

అమ్మ బర్త్‌డే నంబర్‌తో రూ. 240 కోట్ల లాటరీ గెలుచుకున్న తెలంగాణ కుర్రాడు.. కోటీశ్వరుడయ్యాక ఏం చేశాడంటే!
Telangana Lottery Winner

Updated on: Oct 24, 2026 | 6:51 AM

ఒక్క రాత్రిలోనే జీవితం మారిపోవడం అంటే ఇదేనేమో! అబుదాబిలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్ కుమార్ బొల్లా కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యూఏఈ లాటరీలో ఏకంగా 100 మిలియన్ దిర్హామ్‌లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 240 కోట్లు) గెలుచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

అమ్మ పుట్టినరోజే అదృష్ట సంఖ్య:

అనిల్ కుమార్ గతేడాది యూఏఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు తన తల్లి పుట్టినరోజు తేదీని ఆధారంగా చేసుకుని 11 అనే నంబర్‌ను ఎంచుకున్నాడు. ఆ ఒక్క సంఖ్యే అతని రూపురేఖలను మార్చేసింది. జాక్‌పాట్ తగలడంతో ఒక్కసారిగా రూ. 240 కోట్లకు యజమాని అయ్యాడు.

కుటుంబానికి అపరిమిత ప్రేమ.. బహుమతులు:

కోట్లాది రూపాయలు గెలుచుకున్న తర్వాత అనిల్ తన మొదటి ప్రాధాన్యతను కుటుంబానికే ఇచ్చాడు. తల్లికి బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలను కానుకగా ఇచ్చాడు. తండ్రికి ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రీయ వ్యవసాయం) పై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించడానికి సొంతంగా వ్యవసాయ భూమిని కొనిచ్చాడు. తండ్రి కష్టపడి కట్టుకున్న కలల ఇల్లు లోనే ఇప్పటికీ వారి కుటుంబం నివసిస్తుండటం విశేషం. ఇవే కాకుండా, అనిల్ తన కోసం, తన సోదరుడి కోసం ఖరీదైన కార్లు, ఐఫోన్ 17 ఎయిర్, ప్రముఖ బ్రాండ్ వాచీలను కొనుగోలు చేశాడు. అలాగే భారతదేశం, యూఏఈలలో కొన్ని ఆస్తులను కొనుగోలు చేసి, వ్యాపార అవకాశాలను పరిశీలిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ యాత్రలు, నిజమైన సంతోషం:

లాటరీ గెలిచిన తర్వాత అనిల్ పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్, బాలి, థాయిలాండ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. అయితే, ఇన్ని కోట్లు గెలిచినా, ప్రపంచమంతా తిరిగినా తనకు అసలైన సంతోషం కుటుంబంతో గడపడంలోనే దొరికిందని అనిల్ చెబుతున్నాడు. డబ్బు కంటే కుటుంబంతో స్వేచ్ఛగా గడపడానికి సమయం దొరకడమే నాకు లభించిన అతిపెద్ద బహుమతి. నా సంతోషం ఎప్పుడూ నా కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది. నా కోసం నేను ఖర్చు చేసుకోవడం కంటే, నా తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసినప్పుడే నాకు నిజమైన తృప్తి లభిస్తుంది అని అనిల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

సాధారణ ఐటీ ఉద్యోగి స్థాయి నుంచి వందల కోట్ల అధిపతిగా మారినా, తన మూలాలను మరచిపోకుండా కుటుంబ సౌఖ్యాన్ని ముందడుగుగా భావించిన అనిల్ కుమార్ ఉదంతం అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us