Yoga on Scooty: స్కూటీపైనే యువతి యోగా స్టంట్స్.. వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్ల స్పందన ఏమిటంటే..?

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో నానా పాట్లు పడుతున్నారు కొందరు. ఆ క్రమంలో నేల మీద కాలు నిలపలేకుండా ఎన్నో ఫీట్లు చేస్తూ నానారకారలుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి నేలపై చేయవలసిన యోగాను తన స్కూటీ మీద చేసింది. అందుకు

Yoga on Scooty: స్కూటీపైనే యువతి యోగా స్టంట్స్.. వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్ల స్పందన  ఏమిటంటే..?
Girl Doing Yoga On Scooty

Updated on: Apr 25, 2023 | 1:02 PM

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో నానా పాట్లు పడుతున్నారు కొందరు. ఆ క్రమంలో నేల మీద కాలు నిలపలేకుండా ఎన్నో ఫీట్లు చేస్తూ నానారకారలుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి నేలపై చేయవలసిన యోగాను తన స్కూటీ మీద చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు చూసి చూడనట్లుగా వదిలేయగా.. మరి కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఆమె చేసిన యోగా ఫీట్‌ దృశ్యాలను మీరు ఆ వీడియోలో చూడవచ్చు. వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఇదేలాంటి యోగా బ్రో.. ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి’ అంటూ కామెంట్ చేశారు. మరొకరు కూడా స్పందిస్తూ ‘అసలు దీనిని యెగా అంటారా..? ఎక్కడా చెప్పకండి. వింటే నవ్వుతారు’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 47 వేల లైకులు, 5 లక్షల 37 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా పలువురు నెటిజన్లు ఈ వీడియోను తమ సన్నిహితులకు షేర్ కూడా చేస్తున్నారు. ః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us