Viral news: వధువుతో స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయించిన వరుడి స్నేహితులు.. ఎందుకో తెలుసా?

|

Sep 17, 2024 | 7:43 AM

ముఖ్యంగా అబ్బాయిల్లో ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు స్నేహితులతో జల్సాలు చేసిన వారు ఒక్కసారిగా తమను ఎవరో కంట్రోల్ చేస్తున్నారన్న భావనలోకి వెళ్లిపోతుంటారు. పెళ్లికాగానే స్నేహితులకు, పార్టీలకు దూరమై ఇంటికే పరిమితం కావాలని భావిస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ స్నేహితుల గ్యాంగ్‌ ఇలా ఆలోచించే వెరైటీ నిర్ణయం తీసుకున్నారు...

Viral news: వధువుతో స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయించిన వరుడి స్నేహితులు.. ఎందుకో తెలుసా?
Representative Image
Follow us on

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆశలు, మరెన్నో భయాలు ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో ఎక్కడలేని ఆలోచనలు వస్తుంటాయి. ఇది కేవలం అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు జీవించిన వారు ఒక్కసారిగా బంధం అనే ఒక చక్రంలో ఇరుక్కుపోవాల్సి వస్తుందని భావించే వారు కూడా ఉంటారు.

ముఖ్యంగా అబ్బాయిల్లో ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు స్నేహితులతో జల్సాలు చేసిన వారు ఒక్కసారిగా తమను ఎవరో కంట్రోల్ చేస్తున్నారన్న భావనలోకి వెళ్లిపోతుంటారు. పెళ్లికాగానే స్నేహితులకు, పార్టీలకు దూరమై ఇంటికే పరిమితం కావాలని భావిస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ స్నేహితుల గ్యాంగ్‌ ఇలా ఆలోచించే వెరైటీ నిర్ణయం తీసుకున్నారు.

తమ స్నేహితుడికి పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని వధువుతో మాట ఇప్పించుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా స్టాంప్‌ పేపర్‌పై సంతకం కూడా చేయించుకున్నారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్‌పాడులో జరిగింది. ముత్తుకుమార్‌ అనే వ్యక్తికి కురింజిపాడికి చెందిన పవిత్రతో సోమవారం వివాహం జరిగింది. వివాహం పాల్గొన్న ముత్తుకుమార్‌ స్నేహితులు. వధవుతో స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయించుకున్నారు.

వివాహం తర్వాత వరుడు ఇక తమను కలవడేమోనని ఆలోచించారు. దీంతో.. రూ.100 స్టాంప్‌ పేపర్‌ తీసుకొచ్చి అందులో.. పెళ్లయిన తరువాత స్నేహితులతో ఆనందంగా గడపడానికి అనుమతిస్తానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్య చెబుతున్నట్లు రాశారు. వధువుకు ఆ స్టాంప్‌ పేపర్‌ను వివరించి సంతకం పెట్టించుకున్నారు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా సంతకం చేశారు. దీంతో ఈ సంఘటనకు సంబంధించి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..