
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ ట్రెక్కింగ్ చేస్తున్న ఒక వేసవి శిబిరం. సామ్ ఆల్ట్‌మన్ అల్పాహారం బల్ల వద్ద కూర్చుని ఉండటం. లేదా బిల్ గేట్స్ పర్వత మార్గాలలో విహరిస్తూ కనిపించడం. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ, ప్రతి సంవత్సరం జూలైలో, అమెరికాలోని ఇడాహో రాష్ట్రపు ప్రశాంతమైన కొండల మధ్య ఒదిగి ఉన్న సన్ వ్యాలీ అనే ఒక చిన్న పట్టణంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది.
అమెరికాలోని ఐడాహోలో ప్రశాంతంగా ఉండే సన్ వ్యాలీ ప్రతీ ఏటా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, టెక్ దిగ్గజాలు, వ్యాపార వేత్తల రహస్య సమావేశానికి వేదికగా మారుతుంది. దీనిని శ్రీమంతుల సమ్మర్ క్యాంప్ అని పిలుస్తారు. ఈ ప్రైవేట్ కాన్ఫరెన్స్‌ను అలెన్, కంపెనీ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి వ్యాపారవేత్తలు, మీడియా మొగల్స్, టెక్ దిగ్గజాలు హాజరవుతారు. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, టీమ్ కుక్, వారెన్ బఫ్ఫెట్ వంటి ప్రపంచపు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఈ క్యాంప్‌లో ఒకేచోట కలిసి సందడి చేస్తారు.
ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ జరిగే చర్చలు అత్యంత గోప్యంగా ఉంటాయి. సాధారణ మీడియా లేదా జర్నలిస్టులకు లోపలికి ప్రవేశం ఉండదు. సన్ వ్యాలీ రిసార్ట్ చుట్టూ భారీ భద్రత ఉంటుంది. బిలియనీర్లు తమ ప్రైవేట్ జెట్ విమానాల్లో ఇక్కడికి చేరుకుంటారు. స్థానిక విమానాశ్రయం కొన్ని రోజుల పాటు వందలాది ప్రైవేట్ జెట్‌లతో నిండిపోతుంది.
ఉదయం పూట సీరియస్ బిజినెస్ సమావేశాలు, కీలక చర్చలు జరుగుతాయి. డిస్నీ సంస్థ ఏబీసీ ని కొనుగోలు చేయడం, లేదా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికను సొంతం చేసుకోవడం వంటి అనేక చారిత్రాత్మక విలీనాలు, కొనుగోలు ఒప్పందాలకు నాంది పడింది ఈ సన్ వ్యాలీ కాన్ఫరెన్స్‌లోనే.
వ్యాపార చర్చలు ముగిసిన తర్వాత ఈ కుబేరులు సాధారణ వ్యక్తుల్లా మారిపోతారు. గోల్ఫ్ ఆడటం, కొండల్లో హైకింగ్ చేయడం, సన్ వ్యాలీ అందాలను ఆస్వాదిస్తూ సరదాగా సమయాన్ని గడుపుతారు. లగ్జరీ, పవర్, డబ్బు, వ్యాపార వ్యూహాల అద్భుత కలయికగా నిలిచే ఈ సన్ వ్యాలీ కాన్ఫరెన్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన రహస్య వేదికలలో ఒకటిగా నిలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..