Watch Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఫుట్‌పాత్‌పై ప్రమాదకర స్టంట్స్‌.. చివరకు ఏమైందో చూడండి!

సాధారణంగా ఫుట్‌పాత్స్‌ అనేవి జనాలు నడచేందుకు ఏర్పాటు చేసినవి.. అలా కాకుండా వాటిపై వాహనాలు నడిపడం ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించి ఒక ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా ఫుట్‌పాత్‌పై స్టంట్స్‌ చేశారు. కానీ చివరకు బొక్కబొర్లా పడ్డారు. అది చూసిన జనాలు వాళ్లకు తగినశాస్త్రి జరిగింది అనుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఫుట్‌పాత్‌పై ప్రమాదకర స్టంట్స్‌.. చివరకు ఏమైందో చూడండి!
Stunt Goes Wrong

Updated on: Sep 21, 2025 | 11:45 AM

ఎవడైనా బైక్‌పై స్టంట్స్ చేస్తూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ వేగంగా దూసుకెళ్తే.. జనాలు ఏమనుకుంటారు. జాగ్రత్త రరేయ్‌ పడితే పళ్లు రాలుతాయ్‌ అంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్‌ అయిన తర్వాత ఈ బైకర్స్‌ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత జరిగింది చూసి వాళ్లంత సంతృతప్తి పడ్డారు.

ఇంతకు తర్వాత ఏం జరిగిందంటే.. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన యువకుడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత నియంత్రణ కోల్పోయి ఫుట్‌ఫాత్‌పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాద సమయంలో వారిద్దరికి హెల్మెట్స్‌ కూడా లేవు. బైక్ నియంత్రణ కోల్పోయిన వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి పడిపోయారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.

చాలా మంది నెటిజన్లు బైకర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయగా, కొందరు ఈ చర్యను ‘ఫిట్టింగ్‌గా అభివర్ణించారు. మరికొందరు ఇటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనల అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. rushlane అనే ఎక్స్ హ్యాండిల్ షేర్ చేయబడిన ఈ పోస్ట్‌ను ఇప్పటి వరకు 52 వేల కంటే ఎక్కువ మంది ప్రజలు వీక్షించారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.