శానిటరీ ప్యాడ్స్‌తో గర్భ డ్యాన్స్.. సూరత్‌లో మరో హైలైట్

| Edited By:

Oct 08, 2019 | 12:12 PM

నవరాత్రులు సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గర్భ డ్యాన్స్ ఫేమస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆడ, మగ భేదం లేకుండా.. చిన్న, పెద్ద, ముసలి అన్న తేడా లేకుండా అందరూ ఈ డ్యాన్స్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఇక ఈ సంవత్సరం ఈ గర్భ డ్యాన్స్‌ను పలుచోట్ల వినూత్నంగా జరుపుకున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాలపై అందరిలో అవగాహన తీసుకొచ్చేలా.. కొన్ని చోట్ల గర్భ డ్యాన్స్‌ను పర్ఫార్మ్ చేశారు. హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతపై అవేర్‌నెస్ క్రియేట్ చేయగా.. […]

శానిటరీ ప్యాడ్స్‌తో గర్భ డ్యాన్స్.. సూరత్‌లో మరో హైలైట్
Follow us on

నవరాత్రులు సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గర్భ డ్యాన్స్ ఫేమస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆడ, మగ భేదం లేకుండా.. చిన్న, పెద్ద, ముసలి అన్న తేడా లేకుండా అందరూ ఈ డ్యాన్స్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఇక ఈ సంవత్సరం ఈ గర్భ డ్యాన్స్‌ను పలుచోట్ల వినూత్నంగా జరుపుకున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాలపై అందరిలో అవగాహన తీసుకొచ్చేలా.. కొన్ని చోట్ల గర్భ డ్యాన్స్‌ను పర్ఫార్మ్ చేశారు. హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతపై అవేర్‌నెస్ క్రియేట్ చేయగా.. మరోచోట నిండు గర్భిణులు ఉత్సాహంగా ఈ డ్యాన్స్ చేశారు. తాజాగా సూరత్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉపాధ్యాయులు, విధ్యార్థులు తమ గర్భ డ్యాన్స్ వినూత్నంగా చేశారు. చేతిలో శానిటరీ ప్యాడ్స్ పెట్టుకొని.. వాటిపై అందరిలో అవగాహన తీసుకొచ్చేలా డ్యాన్స్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో యువకులు కూడా ఉత్సాహంగా పాల్గొనడం మరో విశేషం. మొత్తానికి సంప్రదాయాల ద్వారా అందరిలో సామాజిక స్పృహను కల్పించడమే ధ్యేయంగా ఈ సంవత్సరం ఈ వేడుకలు సాగాయి.