Garden Courses Counseling: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉద్యానవన కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ షురూ..

|

Jan 09, 2021 | 7:49 PM

Garden Courses Counseling: వ్యవసాయ, ఉద్యాన కోర్సులకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌‌ను ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్

Garden Courses Counseling: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉద్యానవన కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ షురూ..
Follow us on

Garden Courses Counseling: వ్యవసాయ, ఉద్యాన కోర్సులకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌‌ను ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. మొదటి కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఇతర సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు రూ. 2.27 కోట్ల విలువైన పనులను వీసీ ప్రవీణ్‌రావు ప్రారంభించారు. రూ. 1.22 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునాతన గేట్‌ కాంప్లెక్స్‌, రూ.82.40 లక్షలతో ఆగ్రో ఫారెస్ట్రీ విభాగంలో ల్యాబ్‌ , సీడ్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో రూ.23.27 లక్షలతో నిర్మించిన మోడ్యులర్‌ సీడ్‌ గోడౌన్‌‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అన్ని సదుపాయాలను వినియోగించుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.

 

Mahindra Cargo Services: మ‌హీంద్రా కార్గో సేవ‌లు షురూ.. ఏ ఏ నగరాల్లో ప్రారంభిస్తున్నారో తెలుసా..