Video: లైవ్‌ రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల!

సముద్రం అల్లకల్లోలంగా ఉంది.. భారీ అలలు ఎగసిపడుతున్నాయి.. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియచేసేందుకు ఓ రిపోర్టర్ లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ అల రిపోర్టర్‌తో పాటు కెమెరా ఉమెన్‌ను కూడా కిందపడేసింది. దీంతో లైవ్ ప్రసారం మధ్యలో అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: లైవ్‌ రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల!
Spanish Reporter Gets Knocked Down By Giant Wave On Live Tv

Updated on: Oct 23, 2026 | 9:51 PM

సముద్రం అల్లకల్లోలంగా ఉంది.. భారీ అలలు ఎగసిపడుతున్నాయి.. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఓ రిపోర్టర్ లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ అల రిపోర్టర్‌తో పాటు కెమెరా ఉమెన్‌ను  కిందపడేసింది. దీంతో లైవ్ ప్రసారం మధ్యలోనే అంతరాయం ఏర్పడింది. ఈ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల

స్పెయిన్‌లోని ఒండార్రోవా (Ondarroa) తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పరిస్థితిని వివరించేందుకు జర్నలిస్ట్ సెర్గియో ఒవెజెరో (Sergio Ovejero) రంగంలోకి దిగారు. ETB2 టెలివిజన్ ఛానల్‌లో లైవ్‌ రిపోర్టింగ్ చేస్తున్నారు. సముద్రంలో అలలు ప్రమాదకరంగా ఎగసిపడుతున్నాయని, తీర ప్రాంతంలో పరిస్థితులను ప్రేక్షకులకు వివరిస్తున్నారు. పక్కనే కెమెరా ఉమెన్ రాక్వెల్ చిత్రీకరిస్తున్నారు. అంతలోనే సముద్రం నుంచి ఒక్కసారిగా భారీ అల దూసుకొచ్చింది. సముద్రపు గోడను దాటుకుంటూ వచ్చిన ఆ అల నేరుగా రిపోర్టర్‌, కెమెరా ఉమెన్‌ను తాకింది. ఊహించని ఈ పరిణామంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే అక్కడి పరిస్థితి మారిపోయింది. లైవ్ ప్రసారం మధ్యలో నిలిచిపోయింది.

స్టూడియోలో ఆందోళన.. లైవ్ నిలిచిపోవడంతో కలవరం

స్టూడియోలో ఉన్న యాంకర్ ఓడెయ్ ఎస్నాయోలా (Odei Esnaola) కంగారు పడ్డారు.  ఒక్కసారిగా ప్రసారం నిలిచిపోవడంతో రిపోర్టర్‌, కెమెరా ఉమెన్‌కు ఏమైందోనని ప్రేక్షకులు కూడా టెన్షన్ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో దృశ్యాలు స్పష్టంగా చూపించాయి.

రిపోర్టర్ సెర్గియో ఒవెజెరో, కెమెరా ఉమెన్ రాక్వెల్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వారికి  గాయాలు కాలేదని టెలివిజన్ బృందం చెప్పడంతో ప్రేకకులు ఊపిరి పీల్చుకున్నారు. వీడియో చూసి ఆందోళన చెందిన కొందరు సోషల్ మీడియా ద్వారా రిపోర్టర్‌ను సంప్రదించారు. ఒవెజెరో స్పందిస్తూ క్షేమంగానే ఉన్నానని తెలిపారు.

భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. లైవ్ ప్రసారం నిలిచిపోయిన సమయంలో స్టూడియోలో యాంకర్ స్పందించిన తీరుపై కొందరు చర్చించారు. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ అలలు సాధారణం. వాటిని తక్కువ అంచనా వేయకూడదని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తీరానికి దగ్గరగా నిలబడటం ప్రమాదకరం అంటూ కొందరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు సమాచారం అందించేందుకు రిపోర్టర్లు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తారో ఈ ఘటన చూపించింది. మీడియా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us