
ఒక చెప్పుల దుకాణం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చెప్పుల దుకాణం మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మామూలుగా కనిపించే దుకాణం కాదు..ఇందులో ఎయిర్ కండిషన్డ్ సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ చెప్పుల దుకాణం అందించే వృత్తిపరమైన సేవ, విలాసవంతమైన జీవనశైలి ఈ వీడియోను పదే పదే చూడాలనిపించేలా చేస్తాయి. ఈ చెప్పుల దుకాణం దక్షిణ కొరియాలో ఉంది. వైరల్ వీడియో ప్రకారం..స్టార్ హోటల్ లాంటి ఏసీ దుకాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన ఒక ఇండియన్ టూరిస్ట్ ఈ ఆసక్తికరమైన వీడియోను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం, సదరు మోచి ప్రతిరోజూ ఆడి కార్‌లో తన షాపునకు వస్తాడు. అతని దుకాణం కూడా సాధారణంగా లేదు. అది పూర్తి ఎయిర్ కండిషన్డ్ చేయబడి, ఆధునిక యంత్రాలు, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో ఒక ఫైవ్ స్టార్ హోటల్ క్యాబిన్‌ను తలపిస్తోంది.
భారతదేశంలో చెప్పులు తెగిపోతే లేదా షూస్ కొద్దిగా పాడైతే రూ.20 నుండి రూ.50 లోపు రిపేర్ అయిపోతుంది. కానీ, ఈ సౌత్ కొరియా లగ్జరీ షాపులో ఒక చిన్న కుట్టు వేయడానికి భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.400 నుండి రూ.500 వరకు వసూలు చేస్తారు. అంత ధర ఉన్నప్పటికీ, అక్కడ కస్టమర్లు లైన్ కట్టి మరి ఎంతో ఓపికగా తమ వంతు కోసం వేచి చూస్తుండటం విశేషం.
సౌత్ కొరియాలో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. అక్కడ ప్రతి వృత్తిని ఎంతో ప్రొఫెషనల్‌గా భావిస్తారు. దానికి తగిన గౌరవాన్ని, వేతనాన్ని అందిస్తారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి, నాణ్యమైన సేవలను అందించడం వల్లనే అక్కడ అంత డిమాండ్ ఉంది.
కాగా, ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వృత్తి ఏదైనా సరే, అందులో చూపే ప్రొఫెషనలిజం చాలా గొప్పది అని ఒకరు కామెంట్ చేయగా.. మన దేశంలో రూ.50 లలో అయ్యే పనికి అక్కడ రూ.500 తీసుకుంటున్నారా! అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, ఈ లగ్జరీ మోచి దుకాణం మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..