Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టండి.. ట్రై చేయండి!

|

Jan 01, 2022 | 1:55 PM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అన్నింటికీ ఒక్క క్లిక్ సరిపోతుంది. మన వర్క్ మోడ్ నుంచి ఫన్ మూడ్‌కు..

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టండి.. ట్రై చేయండి!
Snake
Follow us on

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అన్నింటికీ ఒక్క క్లిక్ సరిపోతుంది. మన వర్క్ మోడ్ నుంచి ఫన్ మూడ్‌కు వెళ్లాలంటే ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్ కావల్సినంత ఉంది. ఇందులో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. నెటిజన్లకు సవాల్ విసురుతుంటాయి ఫోటో పజిల్స్. అందులో ఏముందో కనిపెట్టేందుకు వీక్షకులు తెగ వెతుకుతారు. మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు పదును పెట్టడంలోనూ ఫోటో పజిల్స్ చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఫోటో పజిల్స్ ఓ పట్టు పడతాం. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్‌కు ప్రత్యేక పేజీలు  ఉన్నాయి. కొన్నిసార్లు పాత పజిల్స్ కూడా మరోసారి వైరల్‌గా మారతాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పాము దాగుంది. చూడటానికి ఎండిన ఆకుల కుప్పలా ఉన్న ఆ ప్రదేశంలో ఓ ప్రమాదకరమైన పాము దాగుంది. దాన్ని కనిపెట్టాలి. ఇక ఈ పజిల్‌ను కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే నూటికి 95 మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.