Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం..

Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!
Snake

Updated on: Nov 01, 2021 | 10:06 PM

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. ముంగీస అయితే పామును చంపేవరకు ఊరుకోదు. ఇక ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా పాము, ముంగీసల మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 44 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో, ఓ ముంగీస.. దాదాపు ఆరడుగుల ఉన్న పామును ఎదుర్కుంటుంది. ఇక ఈ యుద్దంలో ముంగీసదే గెలుపు అని అందరికీ తెలిసిందే. ఆ వీడియోపై మీరు కూడా ఓసారి లుక్కేయండి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాము.. చిన్న మొక్కకు చుట్టుకుని ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఎక్కడ నుంచి చూసిందో గానీ ఓ ముంగీస దాన్ని చూసి యుద్దానికి దిగుతుంది. ఆ కొమ్మ నుంచి పామును క్రిందకు లాగడానికి ప్రయత్నిస్తుంది. పాము ఏమో కిందకు పడకుండా.. ముంగీస దాడిని ప్రతిఘటిస్తుంది. ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడు కూడా ముంగీస పైచేయి సాధిస్తుంది. తన దవడలతో పామును మెడను పట్టుకుని కొరుకుతుంది. చివరికి ముంగీస తెలివి, చురుకుదనానికి ముందు పాము ఓడిపోతుంది. ఈ వీడియోను సుదీర్ దండోతియా అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us