బర్త్‌డే కేక్ ముఖానికి పూస్తున్నారా… అయితే మీరు జైలుకే!

|

May 15, 2019 | 7:42 PM

బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు కేక్ కట్ చేయించి.. పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు. కొంతమంది మరీ మితిమీరిపోయి ఎక్కడ పడితే అక్కడ కేక్ పూస్తారు. అయితే ఇకపై ఇలా చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది నిజమండీ… హద్దులు దాటుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్‌‌ను కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ పోలీసులు. వాటిని అధిగమిస్తే జైలు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గుజరాత్‌లోని సూరత్ పట్టణ పోలిస్ కమీషనర్ ఇందుకు […]

బర్త్‌డే కేక్ ముఖానికి పూస్తున్నారా... అయితే మీరు జైలుకే!
Follow us on

బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు కేక్ కట్ చేయించి.. పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు. కొంతమంది మరీ మితిమీరిపోయి ఎక్కడ పడితే అక్కడ కేక్ పూస్తారు. అయితే ఇకపై ఇలా చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది నిజమండీ… హద్దులు దాటుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్‌‌ను కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ పోలీసులు. వాటిని అధిగమిస్తే జైలు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గుజరాత్‌లోని సూరత్ పట్టణ పోలిస్ కమీషనర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై సూరత్‌లో నిర్వహించే బర్త్‌డే వేడుకల్లో ముఖంపై కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సిందేనట.

అసలు ఈ కఠినమైన రూల్స్ తేవడానికి ఓ కారణం లేకపోలేదు. అదేమిటంటే ఇటీవల సూరత్‌లోని ఇమాస్ రోడ్డులో కొంతమంది ఒక బర్త్‌డే వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో కోడిగుడ్లు విసరడం కారణంగా పలువురు రోడ్డుపై పడిపోయి గాయాలపాలయ్యారు. దీనిపై పోలీస్ కమిషనర్ సతీష్ శర్మకు ఫిర్యాదు అందింది. దీనికి స్పందించిన పోలీసులు వేడుకలో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 188 కింద కేసు కూడా నమోదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవకూడదని పోలీస్ కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.