viral video : చిన్న పిల్లలు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు. కొత్త్తవి చూసినప్పుడో కలిగే ఆనందం, ఆశ్చర్యం మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంతకు ఏం జరిగిందంటే …అదో రైల్వే స్టేషన్..వచ్చిపోయే..రైళ్లు, బిజిబిజీగా ప్రయాణికులు ఉన్నారు. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో ట్రయిన్ కోసం స్టేషన్‌లో ఎదురు చూస్తోంది. చేతిలో చంటిబిడ్డ..మరో ఐదేళ్ల పాపను పట్టుకుని ఆమె రైల్వే స్టేషన్‌లో కూర్చుంది.
ఇదిలా ఉంటే ఉన్నట్టుండి పెద్ద పాప కళ్లలో ఎదురు మెరుపు కనిపించింది. పట్టరాని సంతోషంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోతూ కనిపించింది. ఎదురుగా ఎదో వస్తుంది..తనకు నచ్చినది కనిపించినట్టుంది కాబోలు ఆనందంతో ఉక్కిరిబిక్కరైపోతుంది. పాప సంతోషం చూసిన తోటి ప్రయాణికులు కూడా ఆశ్చర్యంగా చిన్నారి వైపు చూస్తున్నారు. అంతలోనే రైలు బుర్రుమని దూసుకొచ్చింది. ఇదీ అసలు విషయం…రైలు ఎప్పుడెప్పుడూ ఎక్కేదామా అని ఆ చిన్నారి ఎదురు చూస్తోంది.. అంతలో రానే వచ్చింది రైలు..దాంతో చిన్నారి ముఖం థౌంజెండ్ వాట్స్ బల్బులా వెలిగిపోయింది. వావ్…అంటూ ఓ అద్భుతాన్ని చూసినట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది ఆ బుడ్డది…అయితే, బుజ్జిదాని సంతోషానికి కారణం ఏంటని అడిగితే…ఇలా సమాధానం ఇచ్చింది..ఫస్ట్ టైమ్ రైలు ఎక్కడం…ఎంత థ్రిల్లింగ్ ఉందో…మమ్మీ అంటూ…తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..బోసి నవ్వులతో పాప సంతోషాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. క్షణాల్లో ఈ వీడియో లక్షల వ్యూస్ ను సొంతం చేసింది.
Seeing the world through a child’s eyes: Her first time seeing a train. pic.twitter.com/WJeacAJUI5
— Brian Roemmele (@BrianRoemmele) March 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి