ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌..? వైరల్‌గా మారిన వీడియో

వింతైన, కడుపుబ్బ నవ్వించే కథలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక సంఘటనే రష్యన్ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇరినా రుడాకోవా విషయంలో జరిగింది. దుబాయ్‌కి చేరుకున్న ఆమె, ముంబైలో తాను ఎగతాళి చేసిన అదే పానీపూరీ ధరను చూసి ఆశ్చర్యపోయింది. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌..? వైరల్‌గా మారిన వీడియో
Irina Rudakova Pani Puri

Updated on: Aug 19, 2026 | 4:17 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా రష్యన్ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఇరీనా రుడాకోవా షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ముంబై వీధుల్లో తక్కువ ధరకు దొరికే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీని హేళన చేసిన ఆమెకు, దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పానీపూరీ రేటు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది.

భారత్‌లో నివసిస్తున్న రష్యన్ మోడల్, నటి ఇరీనా రుడాకోవా కొద్దిరోజుల క్రితం ముంబైలోని లోఖండ్‌వాలా మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఒక ప్లేట్ పానీపూరీ ధర రూ. 60 అని తెలుసుకుని, 60 రూపాయలా! చాలా ఎక్కువ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఒక వీడియో చేసింది. ముంబై స్ట్రీట్‌ ఫుడ్‌ ఇంత ఖరీదా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని షాక్:

అయితే, ఈ పానీపూరీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇటీవల ఇరీనా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1లో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్ కౌంటర్ వద్ద పానీపూరీ కనిపించింది. అక్కడ రేటు కార్డును చూసిన ఇరీనా ఒక్కసారిగా కంగుతినాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక ప్లేట్ పానీపూరీ ధర 42 యూఏఈ దిర్హామ్‌లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,096లు.

క్షమాపణలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ వీడియో:

దుబాయ్‌లో ఆకాశాన్ని తాకిన పానీపూరీ ధరను చూశాక, ఇరీనా వెంటనే 42 సెకన్ల వీడియోను రికార్డ్ చేసి తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో నవ్వుతూ ఫ్రెండ్స్..! ముంబై లోఖండ్‌వాలాలో రూ. 60 పానీపూరీ గురించి నేను తప్పుగా మాట్లాడాను. దానికి నన్ను క్షమించండి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పానీపూరీ ధర రూ. 1,096గా ఉంది. ఇది చూశాక నాకు నా తప్పు తెలిసొచ్చింది. నేను వెంటనే ఇండియాకి తిరిగి వెళ్తున్నాను అని సరదాగా వ్యాఖ్యానించింది.

వీడియో ఇ్కడ చూడండి..

ఇరీనా రుడాకోవా ఎవరు?:

ఇరీనా రుడాకోవా ఒక ప్రముఖ రష్యన్ మోడల్, నటి, డాన్సర్. ఆమె 20 ఏళ్ల వయస్సులో కెరీర్ కోసం భారతదేశానికి వచ్చింది. రియాలిటీ క్వీన్స్ ఆఫ్ ది జంగిల్ సీజన్-2 విజేతగా నిలిచి క్రేజ్ సంపాదించిన ఈమె, 2024లో బిగ్ బాస్ మరాఠీ సీజన్-5లో పాల్గొని తొలి విదేశీ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె క్షమాపణలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us